వైరల్ స్టోరీస్: చెట్టు ఎక్కే స్కూటర్

వైరల్ స్టోరీస్: చెట్టు ఎక్కే స్కూటర్

ఎత్తైన తాటి చెట్లు, కొబ్బరి చెట్లు ఎక్కడం చాలా కష్టం. అయితే ఒక ఇన్నొవేటివ్ ఐడియాతో ఒకతను ఆ పనిని ఈజీ చేసేశాడు. ఒక కొత్త పరికరం సాయంతో కొబ్బరి చెట్లు సులువుగా ఎక్కేస్తున్నాడు. హర్షా గొయెంకా పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఒకతను  కొత్తరకం స్కూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చెట్లు ఎక్కేస్తున్నాడు. దాన్ని పోస్ట్ చేస్తూ.. హర్షా గొయెంకా.. ‘ఇది నిజమైన ఇన్నొవేషన్’ అని ట్యాగ్ చేశాడు. ఆన్ చేయగానే రయ్ మంటూ చెట్టు ఎక్కుతుంది ఈ స్కూటర్. దీన్ని చూసి నెటిజన్లు ‘వావ్’ అంటున్నారు.

ఈ ట్రీ క్లైంబింగ్ స్కూటర్ 30 సెకన్లలో 84 మీటర్ల నిటారైన చెట్టును అవలీలగా ఎక్కేస్తుందట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ఇప్పటివరకూ నాలుగు లక్షల వ్యూస్ వచ్చాయి.

స్పైడర్ మ్యాన్ దోశ

దోశ అంటే ఇష్టపడని వాళ్లుండరు. దోశల్లో మసాలా, ఉల్లిగడ్డ, చీజ్.. అంటూ రకరకాలు ఉంటాయి. అయితే రీసెంట్‌‌‌‌‌‌‌‌గా కొత్తరకం దోశ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిపేరు స్పైడర్ మ్యాన్ దోశ.స్పైడర్‌‌‌‌‌‌‌‌మ్యాన్ దోశకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన కొద్దిసేపటికే 16 మిలియన్ల వ్యూస్, ఆరు లక్షల లైక్స్ వచ్చాయి. చెన్నై అన్నానగర్‌‌‌‌‌‌‌‌లోని కోరా ఫుడ్‌‌‌‌‌‌‌‌ స్ట్రీట్‌‌‌‌‌‌‌‌లో దోశ సెంటర్ వీడియో ఇది. 

ఈ  వీడియోలో ఒకామె దోశ పిండిని సాలె గూడు లాగా రెండు పెనాలపై వేస్తుంటుంది. ఆ తర్వాత ఒక దోశపై నూనె పోసి రెండో దోశపై గుడ్డు, మసాలా వేస్తుంది. తర్వాత పనీర్‌‌‌‌‌‌‌‌ను స్ప్రెడ్ చేస్తుంది. మసాలా దోశ ఉడికాక దానిపై సాదా దోసె వేసి శాండ్ విచ్ లాగా ఒక స్పెషల్ దోశ తయారుచేసింది. చివరగా, దోశను నాలుగు ముక్కలుగా కట్ చేసి, దాని మీద టొమాటో సాస్‌‌‌‌‌‌‌‌తో స్మైలీ డిజైన్ వేసి.. సర్వ్ చేస్తుంది. ఇదే స్పైడర్ మ్యాన్ దోశ. దీన్ని చూసిన నెటిజన్లు నోరూరుతుందంటూ, టేస్ట్ చేయాలని ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. 

కాయిన్స్​తో స్కూటర్ కొన్నాడు

సొంతంగా బైక్‌‌‌‌‌‌‌‌ కొనుక్కోవాలని చాలామందికి ఉంటుంది. దానికోసం కొంతమంది లోన్ తీసుకుంటారు లేదా డబ్బు సమకూర్చుకునే వరకు ఎదురు చూస్తారు. కానీ, అస్సాంలోని సైదుల్ మాత్రం ఐదేండ్లుగా ఒక్కొక్క రూపాయి పోగేస్తూ 90 వేలు పోగుచేశాడు. తొంభైవేలకు సరిపడా కాయిన్స్​ మూటతో షోరూమ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి తన కల నెరవేర్చుకున్నాడు.. తొంభై వేలకు సరిపడా కాయిన్స్​ ఇచ్చి స్కూటర్ కొన్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌లో తెగ వైరల్ అవుతోంది. 

స్కూటర్‌‌‌‌‌‌‌‌ కొనేందుకు గత ఐదారేండ్లుగా కాయిన్స్​ పోగేసినట్లు సైదుల్ చెప్పాడు. అస్సాంలోని బోరేగావ్‌‌‌‌‌‌‌‌ ప్రాంతంలో చిన్న షాపు నడుపుకునే సైదుల్‌‌‌‌‌‌‌‌కు  ఎప్పటి నుంచో స్కూటర్ కొనుక్కోవాలనే కోరిక ఉండేది. దీంతో రోజూ వచ్చే దానిలో కొంత దాచుకునే వాడట. ఇన్నిరోజులుగా దాచిపెట్టుకున్న కాయిన్స్​ అన్నింటినీ ఒక బస్తాలో వేసుకుని స్కూటర్‌‌‌‌‌‌‌‌ షోరూంకు వెళ్లాడు. తను దాచుకున్న కాయిన్స్​తో ఎట్టకేలకు స్కూటర్‌‌‌‌‌‌‌‌ కొన్నందుకు సంతోషంగా ఉందంటున్నాడు.

ఒక్క డాలరు కోసం బ్యాంక్ దోపిడీ

అమెరికాలో ఈ మధ్య ఓ వింత దోపిడీ జరిగింది. కేవలం ఒక్క డాలర్ కోసం బ్యాంకు దోపిడీకి వెళ్లాడు ఒక దొంగ. అక్కడితో ఆగకుండా.. బ్యాంకు ఉద్యోగులను బలవంతం చేసి మరీ పోలీసుల్ని పిలిపించుకున్నాడు. అదేంటి? అనుకుంటున్నారా. అతనో రకం మరి...

యూఎస్‌‌‌‌‌‌‌‌లోని సాల్ట్ లేక్ నగరంలో 65 ఏండ్ల డొనాల్డ్ శాంటాక్రూజ్  బ్యాంకుకి వెళ్లి ఒక డాలర్ ఇవ్వాలంటూ క్యాషియర్‌‌‌‌‌‌‌‌ను అడిగాడు.“ఇలా చేస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు. నేను బ్యాంకు దోపిడీకి వచ్చా. నాకు ఒక డాలర్ ఇవ్వు” అని మర్యాదగా అడిగాడు. డొనాల్డ్ కోరినట్టే ఒక డాలర్ ఇచ్చిన క్యాషియర్ ‘నువ్వు అడిగిన డాలర్​ ఇచ్చా కదా... ఇక వెళ్లిపో’ అన్నాడు. 

కానీ, అతను మాత్రం ‘నేను వెళ్లేది లేదు’ అని తేల్చి చెప్పాడు. అంతటితో ఆగకుండా పోలీసులను పిలవాలంటూ వాళ్లను ఇబ్బంది పెట్టాడు. భయపడిన బ్యాంకు సిబ్బంది అతడ్ని ఒక గదిలోకి రప్పించి గదికి తాళం వేశారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి డొనాల్డ్‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్ చేశారు. డొనాల్డ్ తన దగ్గర ఉన్న డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పోలీసులకు ఇచ్చి ‘బ్యాంకు దోపిడీ చేసేందుకే వచ్చా’నంటూ నేరం ఒప్పుకున్నాడు. ఆ తరువాత ‘నన్ను అమెరికా ఫెడరల్ ప్రభుత్వ జైలుకే పంపండి. రాష్ట్ర ప్రభుత్వ జైలుకు పంపితే, విడుదలయ్యాక మళ్లీ బ్యాంకు దోపిడీకి దిగుతా’ అన్నాడట.  జైలుకు వెళ్లేందుకే అలా  చేసి ఉంటాడు అంటున్నారు.