హైదరాబాద్‌లో రాత్రి పూట కేవలం వంద రూపాయల కోసం ఒక మహిళ చేసిన చిల్లర వేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకునే ఒక రాపిడో రైడర్‌ను నడిరోడ్డుపై నిలబెట్టి మానసికంగా వేధించింది ఓ మహిళా ప్రయాణికురాలు.
రైడ్ పూర్తయిన తర్వాత ఇవ్వాల్సిన వంద రూపాయలు ఇవ్వకపోగా.. రైడర్‌పై తీవ్రమైన బూతులతో విరుచుకుపడింది. అంతటితో ఆగకుండా, తన డబ్బులు తనను అడిగితే.. నీపై వేధింపుల కేసు పెడతా, లోపలికి పంపిస్తా అంటూ చట్టాలను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు దిగింది. ఆమె చేస్తున్న ఈ అరాచకాన్ని భరించలేకపోయిన రాపిడో రైడర్.. తన మొబైల్ తీసి ఆ నిర్వాకాన్నంతా రికార్డ్ చేశాడు. 'డబ్బులు ఇవ్వకుండా నన్ను ఎందుకు అంతలా తిడుతున్నారు?' అని ప్రశ్నించాడు.
అయినా వినకుండా ఆమె అక్కడి నుంచి పారిపోతుండటంతో.. వదిలిపెట్టని రైడర్, ఆమెను వెంబడించి నడిరోడ్డుపైనే నిలదీశాడు. ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు రావాలని డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కష్టపడే డ్రైవర్‌ను చట్టాల పేరుతో బెదిరించిన ఆ మహిళ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
