
టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ పలికిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. వన్డేలకు కూడా త్వరలోనే గుడ్ బై చెబుతాడంటూ ప్రచారం జరుగుతోంది. బీసీసీఐ తీరుపై తీవ్ర అసంతృప్తితోనే టెస్టులకు వీడ్కోలు పలికాడని.. వన్డేల నుంచి కూడా వైదొలుగుతాడని.. ఇక కోహ్లీని గ్రౌండ్లో చూడలేమని సోషల్ మీడియా, క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు చూసి కోహ్లీ అభిమానులు ఒక వైపు గందరగోళం.. మరోవైపు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
కోహ్లీ వన్డేల నుంచి తప్పుకుంటాడనే వార్తలతో బాధపడుతోన్న రన్ మెషిన్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్. కోహ్లీ మళ్లీ గ్రౌండ్లోకి దిగి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉంటున్న కోహ్లీ.. ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో చెమటోడ్చాడు. రెండు గంటల పాటు కఠోర ప్రాక్టీస్ చేశాడు కోహ్లీ. స్పిన్, పేస్ బౌలింగ్
రెండింటినీ ఎదుర్కొంటూ ఎంతో ఉత్సాహంగా ప్రాక్టీస్ చేశాడు కోహ్లీ. వివిధ రకాల షాట్లను ప్రాక్టీస్ చేశాడు. గ్రౌండ్ నలువైపులా షాట్లు ఆడాడు.
కోహ్లీ లార్డ్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తుండటంతో వన్డేలకు రిటైర్మెంట్ అంటూ వస్తోన్న వార్తలకు చెక్ పడింది. కోహ్లీ ఇప్పట్లో వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చే యోచనలో లేడంటున్నారు క్రీడా విశ్లేషకులు. 2025, అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కోసమే కోహ్లీ సాధన మొదలుపెట్టినట్లు స్పష్టమవుతోంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌కు సిద్ధంగా ఉన్నట్లు బీసీసీఐకి కోహ్లీ సంకేతాలు పంపించినట్లైంది.
ఇక, గ్రౌండ్లో కోహ్లీ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తుండటంతో అతడి అభిమానులు ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. త్వరలోనే తమ అభిమాన ఆటగాడిని మళ్లీ గ్రౌండ్లో చూడొచ్చంటూ ఖుష్ అవుతున్నారు. ఆస్ట్రేలియా.. ఊపిరి పీల్చుకో.. కోహ్లీ వచ్చేస్తున్నాడంటూ సంతోషం పడుతున్నారు. మరీ అక్టోబర్‌లో జరిగే వన్డే సిరీస్ కు బీసీసీఐ కోహ్లీని ఎంపిక చేస్తుందో లేదో చూడాలి.
Virat Kohli Clicked With Fans During Practice Session At Lord's Cricket Ground in London.📸🖤
— virat_kohli_18_club (@KohliSensation) August 23, 2025
.
.
.#ViratKohli #London @imVkohli pic.twitter.com/SECwyzSb4K