Virat Kohli: వన్డే ప్రపంచకప్ 2027 లక్ష్యంగా భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Ro-Ko) తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. వన్డే వరల్డ్ కప్ నాటికి తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ, ఫామ్‌ను అత్యుత్తమంగా కొనసాగించేందుకు ఈ ఇద్దరు సీనియర్ బ్యాటర్లు ముమ్మరంగా శ్రమిస్తున్నారు. రాబోయే ప్రపంచకప్ నేపథ్యంలో వీరిద్దరికీ ప్రతి వన్డే సిరీస్ ఎంతో కీలకం కానుంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ గడ్డపై మరోసారి తమ మార్క్ బ్యాటింగ్‌తో సత్తా చాటాలని ఈ సీనియర్ జంట భావిస్తోంది.
సంజయ్ బంగర్ పర్యవేక్షణలో కోహ్లీ జోరుగా ప్రాక్టీస్:
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో కింగ్ విరాట్ కోహ్లీ గాయంతో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. ఆ గాయం కారణంగానే అతను ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు కూడా దూరం కావాల్సి వచ్చింది. కాగా, ఈ నెలలో ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం ప్రకటించిన భారత తుది జట్టులో కోహ్లీకి చోటు కల్పించినప్పటికీ, సెలెక్టర్లు ఓ కండిషన్ పెట్టారు. మ్యాచ్ సమయానికి కోహ్లీ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే అతడిని బరిలోకి దించుతామని క్లియర్ కట్ గా చెప్పేశారు.
బ్యాటింగ్పై కోహ్లీ నజర్:
బీసీసీఐ పెట్టిన కండిషన్‌తో విరాట్ కోహ్లీ తన ఫిట్‌నెస్, బ్యాటింగ్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. ఇందులో భాగంగా టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పర్యవేక్షణలో కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కోహ్లీ చేస్తున్న ప్రాక్టీస్ చూస్తుంటే ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ నాటికి అతను 100 శాతం ఫిట్‌నెస్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
ALSO READ : సీఎస్‌కేలోకి హార్దిక్ పాండ్యా?.. చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ రిప్లై వైరల్
జూలై 14 నుంచి వన్డే సిరీస్ షెడ్యూల్:
ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ గడ్డపై టీ20 సిరీస్ ఆడుతుండగా, ఆ తర్వాత జూలై 14వ తేదీ నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. జూలై 14వ తేదీ తొలి వన్డేతో ఈ సిరీస్ స్టార్ట్ కానుంది. ఇక రెండో వన్డే జూలై 16న, మూడో వన్డే జూలై 19న జరగనున్నాయి. యువ సంచలనం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఈ వన్డే సిరీస్‌లో బరిలోకి దిగబోతోంది. గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కు దూరం కాగా, భారత పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా మాత్రం తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
🚨 VIRAT KOHLI LEAVES NO STONE UNTURNED
— Infinite Infos (@infiniteInfos) July 1, 2026
Ahead of the England tour, Virat Kohli was spotted training with former India batting coach Sanjay Bangar in Alibaug. While most players enjoy their break, Kohli continues to put in the hard yards.
The hunger, discipline, and dedication… pic.twitter.com/2eR9BS3wLQ
