జోహార్ ఎన్టీఆర్ అంటున్న విశ్వక్.. మాసీ లుక్ కేక

జోహార్ ఎన్టీఆర్ అంటున్న విశ్వక్.. మాసీ లుక్ కేక

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ నుండి ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు మేకర్స్. 2023 మే 28  ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా ఈ లుక్ ని రిలీజ్ చేసారు. షార్ట్ హెయిర్ తో, గడ్డం మీసాలు, లుంగీ, నోటిలో బీడీతో పక్కా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు విశ్వక్. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో తెలుగోడి ఆత్మగౌరవం ఎన్టీఆర్ అని రాసి ఉండి, నందమూరి తారక రామారావు ఫోటో ఉంది.

ఈ మాసీ ఫస్ట్ లుక్ విశ్వక్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంది. రీసెంట్ గా షూటింగ్ మొదలైన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా దాస్స్ కా ధంకీ సినిమాతో డీసెంట్ హిట్ అందుకన్న విశ్వక్.. ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ అనుకుంటాడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

చల్ మోహన్ రంగా మూవీ ఫేం కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందించబోతున్నాడు. హీరోయిన్ గా అంజలి నటిస్తున్నట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ కాంబినేషన్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.