ఫుట్ ట్యాపింగ్ నంబర్‌‌‌‌తో మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన విశ్వక్ సేన్

ఫుట్ ట్యాపింగ్ నంబర్‌‌‌‌తో మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన విశ్వక్ సేన్

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘దాస్‌‌ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్ హీరోయిన్. విశ్వక్ తండ్రి కరాటే రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల టీజర్‌‌‌‌తో ఇంప్రెస్ చేసిన విశ్వక్, తాజాగా ఫుట్ ట్యాపింగ్ నంబర్‌‌‌‌తో మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల’ అంటూసాగే పాటను తెలుగు వెర్షన్‌‌లో సిద్ధు జొన్నలగడ్డ, హిందీ వెర్షన్‌‌ సాంగ్‌‌ను రానా లాంచ్ చేసి విశ్వక్‌‌కి బెస్ట్ విషెస్ చెప్పారు. 

లియోన్ జేమ్స్ స్కోర్ చేసిన ట్యూన్  బాగుంది.  ఫారిన్ లొకేషన్స్‌‌లోని విజువల్స్ అట్రాక్షన్‌‌గా నిలుస్తున్నాయి.  విశ్వక్, నివేదా స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్‌‌తో ఇంప్రెస్ చేస్తున్నారు. లియోన్ జేమ్స్, ఆదిత్య ఆర్కే లైవ్లీగా పాడగా, పూర్ణా చారి లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. హిందీ వెర్షన్‌‌కి అమితాబ్ వర్మ లిరిక్స్ అందించగా, లియోన్ జేమ్స్‌‌తో కలిసి నకాష్ అజీజ్ పాడారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 17న ఈ చిత్రం విడుదల కానుంది.