‘జూ’కు ఎందుకెళ్తాం? పులులు, సింహాలు, ఏనుగులు, అడవి జంతువులను చూడటానికి.. కానీ వాటితో ఆడుకునే చాన్స్ కూడా ఇస్తే? పాలస్తీనాలోని గాజా దక్షిణాన ఉన్న రఫాజూ ఇదే అవకాశాన్ని ఇస్తోంది. ఓ 14 నెలల సింహంతో ఆడుకోమంటోంది.
ఆ ఆడ సింహం పేరు ఫాలెస్టయిన్. మనుషులను చూస్తే భయపడకుండా ఉండేలా దానికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. దాని పంజా గోళ్లూ తీసేశారనుకోండి.. కానీ పళ్లున్నాయండోయ్.
సింహాన్ని రెండు వారాలుగా పెంచుతున్న ఫయేజ్ అల్ హడ్డాడ్.. ఓ రోజు బోనులోంచి దాన్ని బయటకు తీసి స్థానికుల దగ్గరకు తీసుకెళ్లాడు. అలా అలా దాన్ని మనుషులకు అలవాటు చేశాడు. మనుషుల దగ్గర ఉన్నప్పుడు ప్రమాదం జరగకుండా దాని పంజా
గోళ్లను తీసేశామని చెప్పాడు.
6 నెలల్లో పంజా గోళ్లు పెరుగుతాయన్నడు హడ్డాడ్.. సింహం తన ప్రమాదకర ప్రవర్తను ఎప్పుడూ కోల్పోదన్నాడు. జూలో మూడు పిల్లలు సహా 5 సింహాలున్నాయి . కానీ, పంజా గోళ్లను తీసేయడంపై ఎన్జీవోలు మండిపడుతున్నాయి.

