రైలు పైకప్పుకు గాజు విండోస్​ తో విస్టాడోమ్ కోచ్

రైలు పైకప్పుకు గాజు విండోస్​ తో విస్టాడోమ్ కోచ్

సికింద్రాబాద్, వెలుగు: ఈ నెల 10 నుంచి తిరిగి ప్రారంభించిన శతాబ్ది ఎక్స్​ప్రెస్​కు కొత్తగా విస్టాడోమ్ కోచ్ లను అందుబాటులోకి తెచ్చారు. సికింద్రాబాద్–పుణె మధ్య నడిచే ఈ రైలుకు ఇప్పటి వరకు ఉన్న కోచ్​లతో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన విస్టా డోమ్ కోచ్​లతో ప్యాసింజర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రొటేట్ చేసుకునేలా సీట్లు, పెద్ద పెద్ద గాజు కిటికీలే కాకుండా రైలు పైకప్పుకు కూడా గాజు విండోస్​ ఉండటమే ఈ రైలు స్పెషాలిటీ.

రోజూ మధ్యాహ్నం 2.45 గంటలకు సికింద్రాబాద్​ నుంచి బయలు దేరే ఈ రైలు అదేరోజు రాత్రి 11 గంటలకు పుణెకు చేరుకుంటుంది. పుణె నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్​కు మధ్యాహ్నం 2.20కు చేరుకుంటుంది.  విస్టాడోమ్ కోచ్​లో  ఒకరికి రూ. 2,110,  ఎగ్జిక్యూటివ్​ క్లాస్​లో రూ.1,935 చార్జి ఉంటుంది.