మంచిర్యాల జిల్లా : కేంద్ర పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తామన్నారు బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. సీఎం కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర పథకాల నిధులు పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గాంధీ సంకల్ప యాత్రను ప్రారంభించారు వివేక్. అంబేద్కర్ నగర్ లో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి… పార్టీ నేతలతో కలిసి పాదయాత్ర చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని కాలనీల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు వివేక్.


