లద్నాపూర్ ఘటనపై వివేక్ వెంకటస్వామి ఆగ్రహం

లద్నాపూర్ ఘటనపై వివేక్ వెంకటస్వామి ఆగ్రహం

సింగరేణి ఓసీపీ 2 నిర్వాసితుల విషయంలో సింగరేణి వైఖరిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తప్పుపట్టారు. లద్నాపూర్ గ్రామస్థులను అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. అర్థారాత్రి సమయంలో నిర్వాసితులను అదుపులోకి తీసుకోవడంపై వివేక్ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం నిర్వాసితులను ఆదుకోవాలని, 283 ఇండ్లకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

సోమవారం అర్థరాత్రి సమయంలో లద్నాపూర్ గ్రామానికి చేరుకున్న సింగరేణి అధికారులు ఇండ్లను జేసీబీలతో కూల్చే ప్రయత్నం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన దాదాపు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ మంచిర్యాల జిల్లాలోని జైపూర్ పవర్ ప్లాంట్కు తరలించారు. అనంతరం జేసీబీల సాయంతో గ్రామంలో ఇండ్లను నేలమట్టం చేశారు. 283 ఇండ్లకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలంటూ గత 70 రోజుల నుండి లద్నాపూర్వాసులు శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. మరోవైపు బాధితులను అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారంటూ కొందరు గ్రామస్థులు పురుగు మందు డబ్బాలతో వాటర్ ట్యాంకు ఎక్కారు.