మోడీకి భయపడే కేసీఆర్  రావడం లేదు : వివేక్ వెంకటస్వామి

మోడీకి భయపడే కేసీఆర్  రావడం లేదు : వివేక్ వెంకటస్వామి

మోడీకి భయపడే.. సీఎం కేసీఆర్ ప్రధాని పర్యటనకు రావడం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. రైతులకు యూరియా కొరత తీర్చడానికి మోడీ ప్రభుత్వం RFCL ను నిర్మించిందని తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్న వివేక్...  ఒక్కో ఎకరానికి వేల రూపాయల సబ్సిడీని అందిస్తుందని  తెలిపారు. రేపటి సభను విజయవంతం చేసి రైతుల్లో, ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపుతారన్నారు.  మోడీ మీటింగ్ సభ ఏర్పాట్లను వివేక్ పరిశీలించారు. 

మోడీ టూర్ ఇలా 

మోడీ శనివారం మధ్యా హ్నం 1.30కి బేగంపేట ఎయిర్​పోర్ట్‌‌‌‌‌‌‌‌కు చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రధానికి బీజేపీ లీడర్లు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడే బీజేపీ ముఖ్య నేతలతో మోడీ కొద్దిసేపు మాట్లాడుతారు. తర్వాత 2.15 గంటలకు ఎంఐ–17 హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రామగుండం బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 3.30కు రామగుండం ఎరువులు, రసాయనాల పరిశ్రమ (ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌)ను ప్రధాని ప్రారంభిస్తారు. సాయంత్రం 4.15కి పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని పీఎంవో పేర్కొంది. అనంతరం రామగుండంలోని ఎన్టీపీసీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో జరి గే బహిరంగ సభలో మోడీ మాట్లాడుతారు. రామగుండంలో ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌తోపాటు మొత్తం రూ.9,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పీఎంఓ తెలిపింది.