అదే మంత్రి వివేక్ గొప్పతనం.. సామాన్య కార్యకర్తలను అక్కున చేర్చుకుంటారు

అదే మంత్రి వివేక్ గొప్పతనం.. సామాన్య కార్యకర్తలను అక్కున చేర్చుకుంటారు
  • భీం సైనిక్ ఫౌండేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ
  • మంత్రిగా  వివేక్​ 100 రోజులు పూర్తి చేసుకున్న వేళ సక్సెస్​ మీట్​

మెహిదీపట్నం, వెలుగు: రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వివేక్ వెంకటస్వామి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా భీం సైనిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయనగర్ కాలనీ ఆఫీసులో గురువారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఫౌండేషన్​వ్యవస్థాపక అధ్యక్షుడు కళాకోటి సత్యనారాయణ మాట్లాడుతూ వివేక్ వెంకటస్వామి సామాన్య కార్యకర్తను కూడా అక్కున చేర్చుకుని తాను ఉన్నాననే భరోసా ఇస్తారని, అదే ఆయన గొప్పతనమని కొనియాడారు.

 ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. సీసీ, బీటీ రోడ్లు వేయించారని, కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. తర్వాత సెక్రటేరియేట్​కు వెళ్లి మంత్రి వివేక్​ వెంకటస్వామి ఛాంబర్​లో శాలువా కప్పి సత్కరించారు. ఫౌండేషన్ కు చెందిన సిద్దిఖి, తోకల తిరుమల, రాములు, శంకర్, విద్యాసాగర్,  జమాల్ ఖాన్ పాల్గొన్నారు.