ప్రజాభివృద్ధి తప్ప వేరే ఆలోచన లేని మహానేత కాకా

ప్రజాభివృద్ధి తప్ప వేరే ఆలోచన లేని మహానేత కాకా

నిరంతరం ప్రజాభివృద్ధి తప్ప వేరే ఆలోచన లేని మహానేత కాకా అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. కాక వెంకటస్వామి ఎప్పుడు పేద ప్రజలకు సాయం చేయాలని తపించేవారని చెప్పారు. మునుగోడు ప్రచారంలో చాలా మంది కాకా సేవలు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చేయాల్సిన కార్యాచరణపై తనకు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాకా దిశానిర్ధేశం చేశారని గుర్తుచేసుకున్నారు. ఇటీవల ప్రధాని మోడీని కలిసినప్పుడు కూడా కాకా సేవలు గుర్తుచేశారని చెప్పారు.

కాక వెంకటస్వామికి పేదవారికి నాణ్యమైన విద్యను అందించాలని కోరిక ఉండేదని.. ఆ కోరికే  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసిందన్నారు. కాకా ఉంటే అంబేద్కర్ విద్యాసంస్థల విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలు చూసి చాలా సంతోషించేవారని చెప్పారు. కాకా వెంకటస్వామి అడుగుజాడల్లో తమ కుటుంబసభ్యులందరూ నడచుకుంటున్నారని.. ఆయన ఆశయాలను నెరవేరుస్తామని వివేక్ వెంకటస్వామి తెలిపారు.