
మంత్రిగా ప్రమాణం చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.. తన అన్న, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, వదిన రమ ఆశీర్వాదం తీసుకున్నారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని వినోద్ ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన ఆయన.. అన్న, వదిన పాదాలకు నమస్కరించారు.
ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ.. మంత్రిగా తన తమ్ముడు వివేక్‌కు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంతో పాటు మంచిర్యాల జిల్లా అభివృద్ధికి తమ్ముడు వివేక్‌తో కలిసి కృషి చేస్తామని ఆయన తెలిపారు.– వెలుగు, బెల్లంపల్లి