కూకట్ పల్లిలో హోటల్ పార్కింగ్ కోసం చెట్ల నరికివేత... వివేకానందనగర్ వాసుల ఆగ్రహం

కూకట్ పల్లిలో హోటల్ పార్కింగ్ కోసం చెట్ల నరికివేత... వివేకానందనగర్ వాసుల ఆగ్రహం

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లి పరిధిలోని వివేకానందనగర్ కాలనీలో వ్యాపార అవసరాల కోసం దశాబ్దాల నాటి చెట్లను నరికివేయడం వివాదాస్పదమైంది. కాలనీలోని ఏరువాక టిఫిన్ సెంటర్ నిర్వాహకులు వాహనాల పార్కింగ్ కోసం సోమవారం చెట్లను నేలకూల్చారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రభుత్వం పచ్చదనం కోసం కోట్లు ఖర్చు చేస్తుంటే.. కాలనీలో వ్యాపారాల నిమిత్తం నిబంధనలకు విరుద్ధంగా చెట్లను నరికేస్తున్నారని, జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హోటల్​పేరుతో అక్రమంగా షెడ్డు నిర్మిస్తున్నవారిపై, చెట్ల తొలగింపునకు అనుమతిచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.