వొడాఫోన్ ఐడియా దివాలా?..భారీగా షేర్లు పతనం

వొడాఫోన్ ఐడియా దివాలా?..భారీగా షేర్లు పతనం

టెలికాం అడ్జెస్టడ్‌ గ్రాస్‌‌ రెవెన్యూ(ఏజీఆర్‌ ) రివ్యూ పిటిషన్‌ ను సుప్రీం కోర్టు కొట్టివేయడంతో శుక్రవారంసెషన్‌ లో వొడాఫోన్ ఐడియా షేరు భారీగా పతనమయ్యింది. ఈ షేరు బీఎస్‌‌ఈ ఇంట్రాడేలో 39.30శాతం నష్టపోయి రూ. 3.66 స్థా యికి పడిపోయింది. టెలికాం స్పెక్ట్రం యూసేజ్‌ ఛార్జీ(ఎస్‌‌యూసీ),లైసెన్సు ఫీజులకు సంబంధిం చి రూ. 1.47 లక్షలకోట్ల బకాయిలను ఈ నెల 23 లోపు చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పిచ్చిన విషయం తెలిసిందే.ఈ తీర్పును తిరిగి పరిశీలించాలని వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌ టెల్‌‌ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ ను వేశాయి. ఈ పిటిషన్‌ ను గురువారం సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో వొడాఫోన్‌ ఐడియా రూ.53,038 కోట్ల(28,309 కోట్ల లైసెన్స్‌ ఫీజు, రూ.24,729 కోట్ల ఎస్‌‌యూసీ) , ఎయిర్‌ టెల్‌‌ రూ.35,586 కోట్ల(రూ. 21,682 కోట్ల లైసెన్స్‌ ఫీజు,రూ.13,904 కోట్ల ఎస్‌‌యూవీ) బకాయిలను ప్రభుత్వానికి చెల్లించాలి. సుప్రీం కోర్టు రివ్యూ పిటిషన్‌ ను కొట్టేయడం టెలికాం కంపెనీలకు చాలాపెద్ద ఎదురు దెబ్బని మోతిలాల్‌‌ ఓస్వాల్‌‌ తెలిపింది. ఈ తీర్పుతో టెలికాం కంపెనీలపై భారం పెరుగుతుందని, ముఖ్యంగా వొడా ఐడియా మూతపడే అవకాశాలున్నా యని పేర్కొంది. నెట్‌‌వర్క్‌‌ను విస్తరించడం, స్పెక్ట్ర మ్‌ కొనుగోలు, 5జీ టెక్నాలజీకి మారుతుండడం వంటి కారణాల వలన ఇప్పటికేటెలికాం కంపెనీలు ఇబ్బందుల్లో ఉన్నా యని విశ్లేషకులు తెలిపారు. సుప్రీం తీర్పుపై క్యూరేటివ్‌‌ పిటిషన్‌ వేస్తామని ఎయిర్‌ టెల్‌‌ తెలిపింది. వొడా-ఐడియా షేరు చివరికి 25.83 శాతం నష్టంతోరూ. 4.45 వద్ద ముగిసింది. ఎయిర్‌ టెల్‌‌ షేరునెగిటివ్‌‌లో ప్రారంభమైనప్పటికీ, చివరికి 5.47శాతం లాభపడి రూ. 499.80 వద్ద క్లోజయ్యింది.రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌‌ షేరు 2.80 శాతం లాభపడిరూ. 1,581 వద్ద ముగిసింది.

మ్యూచువల్‌ ఫండ్స్‌‌, బ్యాంకులకు ఇబ్బందే..

వొడా ఐడియా కార్పొరేట్‌‌ పేపర్స్‌ , షేర్లను కలిగివున్న మ్యూచువల్‌‌ ఫండ్స్, సుప్రీం తీర్పుతో ప్రస్తుతంఇబ్బందుల్లో పడ్డాయి. వొడా ఐడియాకు ఏజీఆర్‌ బకాయిలతో పాటు రూ. 1.15 లక్షల కోట్ల అప్పులున్నాయి. వొడా ఐడియా డెట్‌‌ ఎక్స్‌ పోజర్‌ ను తగ్గించడానికి మ్యూచువల్‌‌ ఫండ్స్‌ ప్రయత్నిస్తున్నా యి. ఫ్రాంక్లిన్‌ ఇండియా వొడాఐడియాకు అతిపెద్దడెట్‌‌ ఎక్స్‌ పోజర్‌ . ఫ్రాంక్లిన్ వద్ద రూ. 2,074 కోట్లవిలువైన కంపెనీ కార్పొరేట్ పేపర్స్‌ ఉన్నా యి.అంతేకాకుండా ఈ కంపెనీ వద్ద రూ. 630 కోట్లవిలువైన వొడా ఐడియా షేర్లున్నాయి. వన్‌ టైమ్రైటాఫ్‌‌ వలన వొడాఫోన్‌  ఐడియా డెట్‌‌ ఎక్స్‌ పోజర్‌ ఉన్న ఆరు మ్యూచువల్‌‌ ఫండ్ల నికర ఆస్తి విలువ(ఎన్‌ ఏవీ) 4–7 శాతం పడిపోతుంది. ఈ నెల16 నాటికి మ్యూచువల్‌‌ ఫండ్స్‌ మొత్తం ఎక్స్‌ పోజర్‌ రూ. 4,466 కోట్లుగా ఉంది. ఇండస్‌‌ ఇండ్‌ బ్యాంక్‌‌, యెస్‌‌ బ్యాంక్‌‌, ఎస్‌‌బీఐ, పీఎన్‌బీ, ఐసీఐసీఐ బ్యాంకులు వొడాఫోన్‌ ఐడియాకు అధికంగా అప్పులిచ్చాయి. టెల్కోలకు బ్యాంక్ లు ఇచ్చిన అప్పులురూ.1.1 ట్రిలియన్లుగా ఉన్నాయి.