V6 News

బీజేపీని గెలిపిస్తేనే యువతకు ఉపాధి

బీజేపీని గెలిపిస్తేనే యువతకు ఉపాధి

పురియాలా: బెంగాల్‌‌లో తొలి దశ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి. బెంగాల్‌‌‌ను సొంతం చేసుకోవాలని భావిస్తున్న బీజేపీ.. క్యాంపెయిన్‌‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నీ తానై దగ్గరుండి పరుగులు పెట్టిస్తున్నారు. పురియాలాలోని బాగ్‌ముండీలో నిర్వహించిన ప్రచారంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను అధికారంలోకి తీసుకురావాలని ఓటర్లను షా కోరారు. పథకాలు చూసి బీజేపీకి ఓటేయ్యాలన్నారు. లెఫ్ట్‌‌తోపాటు తృణమూల్ కూటమి రాష్ట్రంలో పరిశ్రమలను ఉండనివ్వవన్నారు. ‘లెఫ్ట్ కూటమి ఇక్కడ పరిశ్రమలను నిర్మించనివ్వకుండా అడ్డుకుంది. ఆ తర్వాత దీదీ ఇండస్ట్రీలను ఇక్కడి నుంచి పీకిపారేశారు. లెఫ్ట్, తృ‌ణమూల్‌‌లు ఉద్యోగికతను కల్పించలేదు. యువతకు ఉపాధి కావాలంటే ఎన్డీయే ప్రభుత్వానికి ఓటు వేయాల్సిందే’ అని షా విజ్ఞప్తి చేశారు.