మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకే ఓట్లు వేయాలి: దాసు సురేశ్

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకే ఓట్లు వేయాలి: దాసు సురేశ్

ముషీరాబాద్, వెలుగు: బీసీ హక్కులను కాలరాస్తున్న వివిధ పార్టీలకు మున్సిపల్ ఎన్నికల్లో మరణ శాసనం లిఖించాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ పిలుపునిచ్చారు. బాగ్ లింగంపల్లిలోని బీసీ రాజ్యాధికార సమితి కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీలు సాధించిన 51 శాతం ఫలితాలను మున్సిపల్ ఎన్నికల్లో తిరగరాయాలని, బీసీలపై జరుగుతున్న రాజకీయ కుట్రలను గమనించి ఓటర్లు తమ సత్తా చాటాలని కోరారు. అనునిత్యం సేవలందించే బీసీలకే ఓట్లు వేసి బీసీ రాజ్యాధికార స్థాపనకు బాటలు వేయాలని సూచించారు.