ఇంటి దగ్గరే ఓటెయ్యొచ్చు

ఇంటి దగ్గరే ఓటెయ్యొచ్చు
  • వృద్ధులు, దివ్యాంగులు, కరోనా పేషెంట్లకు ఎమ్మెల్సీ పోల్స్‌‌‌‌లో చాన్స్‌‌

హైదరాబాద్, వెలుగు: మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 80 ఏళ్లు దాటిన వృద్ధులు, కరోనా బాధితులు, దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే ఓటు వేసేలా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించారు.  హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల వారీగా ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సేకరించేందుకు బృందాలను  ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక బృందాలు సీల్డ్ బ్యాలెట్ బాక్స్తో పాటు వారికి కేటాయించిన వెహికల్స్‌‌లో షెడ్యూల్ ప్రకారం ఓటర్ల ఇంటికే వెళ్లి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. దివ్యాంగులు ఈ నెల 9న, 80 ఏళ్లు నిండినవాళ్లు ఈ నెల 10, 11న, కరోనా బాధితులు 11, 12 తేదీల్లో ఇంటివద్దే ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.