జాబ్ చార్ట్ రద్దు చేసి రెండేళ్లయినా.. సరైన డ్యూటీలేదు

జాబ్ చార్ట్ రద్దు చేసి రెండేళ్లయినా.. సరైన డ్యూటీలేదు
  • జనంలోకి వెళితే ఏ హోదాతో వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు
  • పదోన్నతులు లేక ఆర్ధికంగా.. సామాజికంగా నష్టం జరుగుతోంది


కుమ్రం భీం జిల్లా: కాగజ్ నగర్ తహసీల్దార్ ఆఫీసు ముందు వీఆర్వోలు నిరసన తెలిపారు. ప్రభుత్వ హామీలు వెంటనే అమలు చేయాలనీ... జాబ్ చార్ట్ ప్రకటిస్తూ రెవెన్యూశాఖలోనే తమను రీలొకేట్ చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్వోల జాబ్ చార్జ్ ను రద్దు చేసి రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ తమకు సరైన డ్యూటీ ఇవ్వలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 
ఏ హోదా ఇవ్వక పోవడంతో మానసికంగా ఆందోళన చెందుతున్నామని వారు తెలిపారు. గ్రామాల్లో విచారణలు, ధృవీకరణలు, సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపికకు వెళితే... ఏ హోదాతో చేస్తున్నారని జనం ప్రశ్నిస్తున్నారని వారు పేర్కొన్నారు. పదోన్నతుల్లేక ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.