హమాలీల కూలీ రేట్లు పెంచాలి.. ఏఐటీయూసీ డిమాండ్

హమాలీల కూలీ రేట్లు పెంచాలి..  ఏఐటీయూసీ డిమాండ్

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్​మోండా మార్కెట్ గ్రెయిన్​విభాగంలో ఉన్న హమాలీలతో రోజూ 12 గంటలు పనిచేయించుకుంటూ, శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకపోవడం అన్యాయమని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ అన్నారు. కూలీ రేట్లు పెంచాలని డిమాండ్​చేశారు. ఆదివారం మోండా మార్కెట్‌‌లో హమాలీ యూనియన్​సమావేశం జరిగింది. పలువురు హమాలీలు ఏఐటీయూసీలో చేరారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ.. హమాలీలకు ఏటా రెండు జతల యూనిఫాం, మార్కెట్ కమిటీ నుంచి లైసెన్స్‌‌లు ఇవ్వాలని డిమాండ్​చేశారు. కూరగాయల విభాగంలో పెంచినట్లుగానే గ్రెయిన్​మార్కెట్ హమాలీలకు కూడా చార్జీలు పెంచాలని చోరారు. ప్రభుత్వం హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పీఎఫ్, ఈఎస్‌‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. హమాలీ యూనియన్​నాయకులు బెల్లపు నరేశ్, మోతె రవి, హత్కురి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.