అక్షయపాత్రకు వాఘ్బక్రీ వాహనాలు

అక్షయపాత్రకు వాఘ్బక్రీ  వాహనాలు

హైదరాబాద్​సిటీ, వెలుగు:  వాఘ్​బక్రీ టీ గ్రూప్​కు చెందిన సేవా విభాగం వాఘ్​బక్రీ ఫౌండేషన్, అక్షయ పాత్ర ఫౌండేషన్​తో కలిపి 8 ప్రత్యేక ఆహార పంపిణీ వాహనాలను సోమవారం ప్రారంభించింది. బడి పిల్లలకు పోషకాహారం అందించేందుకు ఈ వాహనాలను వినియోగించనున్నారు. నగరంలోని హరే కృష్ణ గోల్డెన్​ టెంపుల్​ ఆలయంలో  సోమవారం జరిగిన కార్యక్రమంలో వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటి వరకూ అక్షయ పాత్రకు వాఘ్​ బక్రీ ఫౌండేషన్ 5 కోట్ల విలువైన 38  వాహనాలు అందజేసింది. అక్షయపాత్ర తెలంగాణ, ఏపీ అధ్యక్షుడు సత్యగౌరచంద్ర దాస ప్రభూజీ, వాఘ్​బక్రీ టీ గ్రూప్​ ఈడీ పరాస్​ దేశాయ్, వాఘ్​బక్రీ బ్రాండ్​అంబాసిడర్​ సుమ కనకాల పాల్గొన్నారు.