వాంఖేడి స్టేడియాన్ని క్వారంటైన్ కేంద్రంగా మార్చనున్న మహా సర్కార్

వాంఖేడి స్టేడియాన్ని  క్వారంటైన్ కేంద్రంగా మార్చనున్న మహా సర్కార్

ముంబై : ముంబై లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో హాస్పిటళ్లన్నీ నిండిపోతున్నాయి. దీంతో వాంఖేడి క్రికెట్ స్టేడియాన్ని క్వారంటైన్ కేంద్రంగా మార్చాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. వీలైనంత త్వరగా స్టేడియాన్ని అప్పగించాలంటూ బృహన్ ముంబై కార్పొరేషన్ వారిని కోరింది. కరోనా పేషెంట్లను ట్రీట్ మెంట్ తో పాటు కొంతమందిని క్వారంటైన్ చేసేందుకు కూడా స్టేడియాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. కేసుల సంఖ్య మరింత పెరిగితే అందుకు తగిన విధంగా సిద్ధమయ్యేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముంబై మున్సిపాలిటీ పరిధిలోని హోటల్స్‌, లాడ్జ్‌, క్లబ్స్‌, కాలేజీలు, పంక్షన్‌ హాల్స్‌ ను కూడా ఆధీనంలోకి తీసుకోనుంది. అవసరాన్ని బట్టి వాటిని వాడనుంది. ఇప్పటికే ఆయా యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది. కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్లు, ఇతర పారా మెడికల్ స్టాఫ్స్ కు డాక్టర్లకు వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే దాదాపు 29 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మే 31 వరకు లాక్ డౌన్ ను పొడగిస్తున్నట్లు మహా సర్కార్ ప్రకటించింది.