వనపర్తి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోజుకో పంచాయతీ

వనపర్తి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోజుకో పంచాయతీ
  • సీనియర్లతో లొల్లి ఒడువకముందే మరో వివాదం 

వనపర్తి, వెలుగు: వనపర్తి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోజుకో పంచాయతీ తెరపైకి వస్తోంది. ఇప్పటికే  సీనియర్లతో పంచాయతీ పెట్టుకున్న మాజీ మంత్రి చిన్నారెడ్డి అది కొలిక్కి రాకముందే మరో వివాదంలో తలదూర్చారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేనా రెడ్డికి సమాచారం ఇవ్వకుండా మండలాల్లో మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పెట్టి యూత్ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీలను నియమించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేవారెడ్డి శుక్రవారం వనపర్తిలో ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టి చిన్నారెడ్డి వేసిన యూత్ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీలు చెల్లవని ప్రకటించారు. అంతేకాదు ఈ సారి పార్టీ టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తనకే వస్తుందని స్పష్టం చేశారు. 

సీనియర్లతో పంచాది ఒడుస్తలే

మాజీ మంత్రి చిన్నారెడ్డి వర్సెస్ సీనియర్ల మధ్య కొనసాగుతున్న పంచాది ఒడుస్తలేదు. తన ఓటమికి సీనియర్లే కారణమని కామెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో మొదలైన గొడవ.. ఇటీవల తన అనుచరుడైన శ్రీరంగాపురం జడ్పీటీసీ రాజేంద్ర ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డీసీసీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నియమించడంతో మరింత ఎక్కువైంది. దీంతో సీనియర్లు సపరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానే ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన జిల్లా కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బహిష్కరించి.. మాజీ డీసీసీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పీసీసీ డెలికేట్ శంకర్ ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో షాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకున్నారు. ఈ సందర్భంగా చిన్నా రెడ్డి హటావో.. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బచావో అని నినాదాలు కూడా చేశారు.దీంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ హోదాలో శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత సీనియర్లంతా చిన్నారెడ్డికి వ్యతిరేకంగా ఏకంగా గాంధీభవన్ ముందే నిరసన దీక్షలు చేపట్టారు. అనంతరం జరిగిన ఓ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పార్టీ సీనియర్లతో కలిసి పనిచేస్తానని చిన్నారెడ్డి క్లారిటీ ఇచ్చినా గొడవ సద్దుమణగలేదు. 

చిన్నారెడ్డిపై వ్యతిరేకతకు శివసేనానే కారణం!

తనపై సీనియర్ల వ్యతిరేకతకు శివసేనా రెడ్డే కారణమని చిన్నారెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. పలు సందర్భల్లో  తనకే టికెట్ వస్తుందని శివసేనా రెడ్డి ప్రచారం చేస్తున్నట్టు ఆయన దృష్టికి రావడంతో పార్టీలోని ఒక వర్గాన్ని తనపైకి రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన పరిణామాలకు శివసేనా రెడ్డే బాధ్యుడని చిన్నారెడ్డి అనుచరులు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చిన వారి గెలుపుకు పనిచేయాలని, శివసేనా రెడ్డికి ఇచ్చినా తాను పనిచేస్తానని చిన్నారెడ్డి కామెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం ఇందులో భాగమేనని చర్చ జరుగుతోంది. శివసేనా రెడ్డికి చెప్పకుండా కమిటీలు వేయడం కూడా అతనికి చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టేందుకేనని తెలుస్తోంది. 

పెరుగుతున్న అసంతృప్తి

వనపర్తిలో ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండడంతో పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతోంది. క్యాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న నాయకులు తలోదిక్కుపోతుండడంతో దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న చిన్నారెడ్డి ఏకపక్ష నిర్ణయాలు కూడా సీనియర్లకు నచ్చడం లేదు. ఈ సారి తన ఇద్దరు కొడుకుల్లో ఒకరిని పోటీకి దింపుతానని చెప్పడాన్ని వాళ్లు జీర్ణించుకోవడం లేదు.  పార్టీ కోసం పనిచేస్తున్న వారిని కాదని వారసులకు టికెట్ ఇస్తే తాము పనిచేయలేమని ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తేల్చిచెప్పారు. ఈ సారి  బీసీ నేతకు  ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తనకే వస్తుందని శివసేనారెడ్డి ప్రకటన చేయడం హాట్ టాపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. చిన్నారెడ్డి వేసిన యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీలు చెల్లవని, సీనియర్లను కలుపుకొని పోతానని చెప్పడం.. మాజీ మంత్రికి వ్యతిరేకంగా వెళ్లడమేనని చర్చ జరుగుతోంది.