30 లీటర్ల చనుబాలను దానమిచ్చిన మాతృమూర్తి

30 లీటర్ల చనుబాలను దానమిచ్చిన మాతృమూర్తి
  • హనుమకొండలోని మదర్స్‌‌‌‌ మిల్క్ బ్యాంక్‌‌‌‌లో అందజేసిన శ్రీనందిని

వరంగల్, వెలుగు: బిడ్డకు పాలు పడితే అందం తరిగిపోతుందని కొందరు తల్లులు భావించే ఈ రోజుల్లో.. ఓ మాతృమూర్తి చిన్నారుల కోసం ఏకంగా 30 లీటర్ల తల్లిపాలను దానమిచ్చింది. వరంగల్ జిల్లాకు చెందిన కూచిపూడి నృత్య కళాకారిణి, రైల్వే ఉద్యోగిని పసుపులేటి శ్రీనందిని తల్లిపాలు దానం చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. శ్రీనందిని రెండు నెలల కింద పాపకు జన్మనిచ్చింది. తన బిడ్డకు పాలు ఇవ్వగా మిగిలిన పాలను.. హాస్పిటల్‌‌‌‌లో చికిత్స పొందుతూ తల్లిపాలు అందని చిన్నారులకు దానం చేయాలన్న ఆలోచన చేసింది.

ఇందుకోసం పలువురు గైనకాలజిస్ట్‌‌‌‌ల సలహాలు, సూచనలు పాటించింది. అమెరికా నుంచి వారి బంధువులు వస్తున్న క్రమంలో.. పాలు ఎక్కువ రోజులు స్టోరేజీ ఉండే పరికరాలను తెప్పించింది. దాదాపు 30 లీటర్ల పాలను దానం చేసింది. హనుమకొండ గవర్నమెంట్ మెటర్నరీ హాస్పిటల్లోని మదర్స్‌‌‌‌ మిల్క్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌కు శనివారం ఈ పాలను అందజేశారు.