రాయికల్ మండలంలోని వార్డు సభ్యుడిగా టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గెలుపు..సర్పంచ్ఓటుతో ఉపసర్పంచ్ అయిండు

రాయికల్ మండలంలోని వార్డు సభ్యుడిగా టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గెలుపు..సర్పంచ్ఓటుతో ఉపసర్పంచ్ అయిండు

రాయికల్, వెలుగు: రాయికల్​ మండలం మంక్త్యానాయక్​ తండా జీపీ ఎన్నికల్లో విచిత్రం జరిగింది. టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గెలిచిన వార్డు సభ్యుడు.. సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓటుతో ఉపసర్పంచ్ అయ్యాడు. మంక్త్యానాయక్ తండాలో 8 వార్డులున్నాయి. ఇందులో 7వ వార్డు నుంచి నునావత్​ రాజు, మాలోతు సూర్యనాయక్​పోటీ పడ్డారు. 

ఆ వార్డులో 59 ఓట్లు పోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాగా, ఒకటి చెల్లలేదు. ఇద్దరికి చెరో 29 చొప్పున వచ్చాయి. రీకౌంటింగ్​ చేసినా ఫలితం లేకపోవడంతో ఎన్నికల అధికారి టాస్​ వేశారు. ఈ టాస్​లో సూర్యనాయక్​ గెలుపొందారు. దీంతో 8 వార్డుల్లో ఇరువర్గాలు చెరో నాలుగు గెలిచారు. దీంతో ఉపసర్పంచ్ పదవికి పోటీ ఏర్పడింది. సర్పంచ్​ మాలోతు తిరుపతి ఓటుతో సూర్యనాయక్​  ఉపసర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎన్నికయ్యాడు.