విమెన్స్ వన్డే వరల్డ్ కప్ ముంగిట .. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌, కివీస్‌‌‌‌‌‌‌‌తో ఇండియా వామప్ మ్యాచ్‌లు

విమెన్స్ వన్డే వరల్డ్ కప్ ముంగిట .. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌, కివీస్‌‌‌‌‌‌‌‌తో ఇండియా వామప్ మ్యాచ్‌లు

బెంగళూరు: ఈ ఏడాది సెప్టెంబర్–-అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విమెన్స్ వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ ముంగిట ఇండియా అమ్మాయిల జట్టు రెండు వామప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడనుంది. బెంగళూరు వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో తలపడుతుంది. పాకిస్తాన్ జట్టు మాత్రం తమ రెండు వామప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లతో పాటు  వరల్డ్ కప్ పోటీలను శ్రీలంకలోనే ఆడనుంది. బీసీసీఐ, పాక్ క్రికెట్ బోర్డుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. టీమిండియా సెప్టెంబర్ 25న బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌లెన్స్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌–1లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో, అదే నెల 27న చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో తలపడుతుంది. 

వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ సెప్టెంబర్ 30న చిన్నస్వామి స్టేడియంలోనే ప్రారంభం కానుంది. ఇక, పాకిస్తాన్  కొలంబో క్రికెట్ క్లబ్‌‌‌‌‌‌‌‌లో సెప్టెంబర్ 25న శ్రీలంకతో, సెప్టెంబర్ 28న శ్రీలంక–ఎ జట్టుతో  రెండు వామప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడుతుంది.  మొత్తంగా ఎనిమిది జట్లు రౌండ్ -–రాబిన్ వామప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో పాల్గొంటాయి. సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు బెంగళూరు, కొలంబోలోని నాలుగు వేదికల్లో తొమ్మిది డే-నైట్ వామప్‌‌‌‌‌‌‌‌లు జరుగుతాయని ఐసీసీ తెలిపింది. కాగా, 12 ఏండ్ల విరామం తర్వాత వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌నకు  ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు బెంగళూరు, గువాహతి, ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విశాఖపట్నంతో పాటు  కొలంబోలో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు జరుగుతాయి.