న్యూఢిల్లీ: 20వ సీజన్ ప్రారంభానికి ముందే ఐపీఎల్లో భారీ ట్రేడ్ డీల్ జరిగింది. ఈ మెగా డీల్‌లో భాగంగా లక్నో సూపర్ జైయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంఛైజీలు పరస్పరం ఆటగాళ్లను మార్చుకున్నాయి. లక్నో కెప్టెన్, స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను రూ.15 కోట్లకు ఢిల్లీ ట్రేడ్ చేసుకోగా.. స్టార్ స్పిన్నర్ కుల్దీ్ప్ యాదవ్‌ను రూ.13.5 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది. ఈ మెగా ట్రేడ్ డీల్ ద్వారా పంత్ తన ఓల్డ్ ఫ్రాంచైజీ ఢిల్లీకి రాగా.. కుల్దీప్ యాదవ్ తన సొంత రాష్ట్రానికి (ఉత్తరప్రదేశ్) చెందిన లక్నో జట్టుకు వెళ్లాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ట్రేడ్ డీల్స్‌లో ఇది ఒకటిగా నిలిచింది.
పంత్ పూర్ ఫెర్ఫామెన్స్:
స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను 2025 మెగా వేలంలో లక్నో రూ. 27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్ ధర. కానీ పంత్ నేతృత్వంలో 2025, 2026 సీజన్లలో లక్నో జట్టు పూర్ ఫెర్ఫామెన్స్ చేసింది. కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా చేరకుండా లీగ్ దశలోనే లక్నో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అటు కెప్టెన్‌గా ఇటు బ్యాటర్‌గా పంత్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో పంత్‌ను వదిలేసుకోవాలని లక్నో మేనేజ్మెంట్ డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే ఢిల్లీతో ట్రేడ్ డీల్ చేసుకుంది. పంత్ తన జీతాన్ని భారీగా తగ్గించుకుని రూ.15 కోట్లకు ఢిల్లీలో చేరేందుకు అంగీకరించాడు.
►ALSO READ | వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. కల నెరవేరిందంటూ ఎమోషనల్ !
సొంత గూటీకి కుల్దీప్:
స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐపీఎల్లో గత ఐదు సీజన్ల నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరుఫున ఆడుతున్నాడు. ఢిల్లీ జట్టులో ఈ చైనామన్ స్పిన్నర్ కీలక బౌలర్. అయితే, ఐపీఎల్ 20వ సీజన్‌కు ముందే ట్రేడ్ డీల్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ కుల్దీప్ యాదవ్‌ను లక్నోకు స్వాప్ చేసింది. అతడి స్థానంలో లక్నో నుంచి స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను ఢిల్లీ ట్రేడ్ చేసుకుంది. ప్రస్తుతం ఢిల్లీ నుంచి రూ.13.5 కోట్ల వేతనం అందుకుంటున్న కుల్దీప్ అంతే ధరకు లక్నో జట్టులో చేరాడు. కుల్దీప్ స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్ కావడంతో ఇది అతనికి హోమ్‌కమింగ్ లాంటిది.
🚨 Announcement 🚨
— IndianPremierLeague (@IPL) June 23, 2026
Rishabh Pant and Kuldeep Yadav complete high-profile trade between @DelhiCapitals and @LucknowIPL.
Rishabh Pant all set to rejoin #DC at INR 15 Crore whereas Kuldeep Yadav will join #LSG at INR 13.5 Crore.
More Details ▶️ https://t.co/64HeOX143I… pic.twitter.com/tIEvj7fgNo
