టీమిండియా చిచ్చరపిడుగు.. ఫ్యూచర్ స్టార్ వైభవ్ సూర్యవంశీ చేతికి ఎట్టకేలకు టీమిండియా జెర్సీ వచ్చింది. టీమిండియా తరఫున ఆరంగేట్రం చేసేందుకు సిద్ధమైన తరుణంలో జెర్సీ వచ్చిన సందర్భంగా ఎమోషనల్ అయిన వీడియో వైరల్ గా మారింది. శుక్రవారం (జూన్ 26) ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో వైభవ్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఇండియా జెర్సీలో వైభవ్ ఎలా కనిపిస్తాడో బీసీసీఐ తొలిసారిగా మంగళవారం (జూన్ 23) చూపించింది. బీసీసీఐ పంపిన జెర్సీని ధరించిన సూర్యవంశీ భావోద్వేగానికి లోనయ్యాడు. దీనిని మాటల్లో చెప్పలేను. నేను మొదటి రోజు నుంచే బ్యాట్ పట్టుకుని ప్రాక్టీస్ కోసం క్రికెట్ గ్రౌండ్‌కు వెళ్లడానికి గల ఆదర్శం ఇదే. ఇండియా తరఫున ఆడాలి.. జెర్సీ ధరించాలనే కల నెరివేరినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు.
తన జర్నీలో అతిపెద్ద అడుగు ఈరోజుతో పూర్తయింది. ఈ అనుభూతిని నేను నిజంగా మాటల్లో చెప్పలేను. ఇది ఒక కలలా అనిపించింది. ఆ టీ-షర్టును చూసిన క్షణం, నా నవ్వు ఆగలేదు. కొన్నిసార్లు, మనం ఊహించనిది జరుగుతుంది. అది జరిగినప్పుడు, ఎలా స్పందించాలో మనకు తెలియదు. నాకు సరిగ్గా అలాగే అనిపించింది చెప్పుకొచ్చాడు.
సూర్యవంశీ తన భారత జెర్సీని అందుకున్న క్షణాలను బీసీసీఐ వీడియో చిత్రీకరించింది. టీమ్ ఇండియా త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు అతని ఇంటి తలుపు తట్టగా, వైభవ్ కార్టన్‌ను తెరిచే ముందు అతని పాదాలకు నమస్కరించి పలకరించాడు. సూర్యవంశీ జెర్సీని బయటకు తీసి, చేతుల్లో పట్టుకుని, ఆ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ దానిని అలాగే చూస్తూ ఉండిపోయాడు.
Ladies & Gentlemen
— BCCI (@BCCI) June 23, 2026
The moment the nation has been waiting for has arrived!
Vaibhav Sooryavanshi in #TeamIndia jersey. Witness this incredibly special moment ❤️ pic.twitter.com/sUUytFMPVw
