న్యూఢిల్లీ: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న భారత స్టార్ స్పిన్నర్ శ్రీచరణి ఐసీసీ వరల్డ్ నెంబర్ వన్ టీ20 బౌలర్‌గా అవతరించింది. మంగళవారం (జూన్ 23) ఐసీసీ విడుదలైన చేసిన టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ బౌలర్ లిన్సే స్మిత్‌ను వెనక్కి నెట్టి శ్రీచరణి అగ్రపీఠాన్ని కైవసం చేసుకుంది.
21 ఏళ్ల తెలుగు అమ్మాయి.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఏడాది కాలంలోనే ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకోవడం విశేషం. ఇక ఐసీసీ టీ20 బౌలర్ల టాప్ 10 ర్యాంకింగ్స్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంగ్లాండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ నాలుగు స్థానాలు ఎగబాకి 4వ స్థానానికి చేరుకుంది. లారెన్ బెల్ నాలుగు స్థానాలు దిగజారి ఏడవ స్థానానికి పడిపోగా.. దీప్తి మూడు స్థానాలు కోల్పోయింది.
టీ20 వరల్డ్ కప్ లో శ్రీచరణి స్పిన్ మ్యాజిక్
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో స్టార్ స్నినర్ శ్రీచరణి దుమ్మురేపుతోంది. కేవలం మూడు మ్యాచుల్లోనే 10 వికెట్లు పడగొట్టి.. టోర్నీ హాయ్యెస్ట్ వికెట్ టేకర్స్ లిస్ట్‌లో టాప్ ప్లేసులో కొనసాగుతోంది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీచరణి.. నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో4 వికెట్లు తీసింది. సౌతాఫ్రికాతో జరిగిన మూడో మ్యాచ్‌లో 3 వికెట్లు సాధించింది. తద్వారా మహిళల టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో 10 వికెట్ల మైలురాయిని అందుకున్న రెండో భారతీయ బౌలర్‌గా తెలుగు అమ్మాయి రేర్ ఫీట్ నెలకొల్పింది.
►ALSO READ | ఇంగ్లాండ్ టీ20 సిరీస్ నుంచి నితీష్ రెడ్డి ఔట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ
