హాస్పిటల్ యాజమాన్యం వేధింపులు..మత్తు ఇంజక్షన్ తీసుకుని హైదరాబాద్ లో డాక్టర్ ఆత్మహత్య

హాస్పిటల్ యాజమాన్యం వేధింపులు..మత్తు ఇంజక్షన్ తీసుకుని  హైదరాబాద్ లో డాక్టర్ ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలో ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడే. తోటి యాజమాన్యం వేధింపులు తాళలేక ఆత్మహత్యకు  పాల్పడ్డాడు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రికవరీ హాస్పిటల్‌లో ఈ ఘోరం  జరిగింది. 

రికవరీ హాస్పిటల్‌లో డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (DMO)గా పనిచేస్తున్న డాక్టర్ ఖాసిం.. హాస్పిటల్ యాజమాన్యం వేధింపులు, మితిమీరిన పని ఒత్తిడి తట్టుకోలే మనస్తాపానికి గురైన ఆయన.. ఆసుపత్రిలోని రూమ్ నెంబర్ 201లోకి వెళ్లి లోపలి నుంచి గడియ పెట్టుకున్నారు. అనంతరం తన చేతికి తానే పాయిజన్ (మత్తు) ఇంజక్షన్ ఇచ్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

అయితే ఈ ఘటన జరిగిన తర్వాత రికవరీ హాస్పిటల్ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్ ఖాసిం ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని బయటకు పొక్కకుండా.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం చేసిన దాష్టికం, మానసిక వేధింపుల వల్లే డాక్టర్ ఖాసిం ప్రాణాలు కోల్పోయాడని.. తమకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.

►ALSO READ | అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం... ఇద్దరు కార్మికులు మృతి..

ఘటనపై సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అసలు రూమ్ నెంబర్ 201లో ఏం జరిగింది? యాజమాన్యం వేధింపుల వెనుక ఉన్న అసలు కారణాలేంటి? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.