బెంగాల్ ఎన్నికల సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఝార్‌గ్రామ్ జిల్లాలో గురువారం మొదటి దశ పోలింగ్ జరుగుతుండగా, ఒక ఏనుగు అనూహ్యంగా పోలింగ్ బూత్ వద్దకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. స్థానికంగా "రామ్‌లాల్" అని పిలవబడే ఈ ఏనుగు, జితుషోల్ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రత్యక్షమైంది.
పోలింగ్ బూత్ వద్ద ఏనుగు హల్‌చల్
సరిగ్గా ఓటింగ్ ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు ఈ 'గజరాజు' ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. అక్కడే ఉన్న ఒక సరుకు రవాణా వాహనాన్ని ఏనుగు పరిశీలించి అక్కడి నుండి వెళ్ళింది. రామ్‌లాల్ ఏనుగు ఎవరికీ ఎటువంటి హాని చేయనప్పటికీ, ఓటు వేయడానికి వచ్చిన ప్రజలు, అధికారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపు ఓటింగ్‌కు అంతరాయం ఏర్పడిన, ఆ ఏనుగును చూడటానికి జనం ఎగబడ్డారు.
►ALSO READ | టాయ్లెట్లో బిడ్డను కని.. పుట్టిన బిడ్డను గొంతుకోసి చంపేసిన యువతి
అటవీ శాఖ చర్యలు
సమాచారం అందుకున్న వెంటనే లోధాశాలి రేంజ్ అటవీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఎలిఫెంట్ ట్రెక్కర్స్ బృందం సహాయంతో రామ్‌లాల్‌ను సురక్షితంగా సమీప అటవీ ప్రాంతంలోకి తరలించారు. ఏనుగు అక్కడి నుండి వెళ్లిపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు, ఆ తర్వాత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది.
బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అలాగే బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. 152 నియోజకవర్గాల్లో తొలి దశ పోలింగ్ భారీ భద్రత మధ్య సాగుతోంది. ఏప్రిల్ 29న రెండో దశ ఎన్నికలు జరగనుండగా, మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఎన్నికల వేడిలో ఏనుగు రాక మాత్రం ఓటర్లకు ఒక వింత అనుభూతిని మిగిల్చింది.
Elephant strolling around a polling station in Jhargram, West Bengal on #ElectionDay 😀😀pic.twitter.com/mEbKyH1nX7
— Aryan (@chinchat09) April 23, 2026

