క్లోరినేషన్ ​ప్రాసెస్​ను ఆటోమేషన్​ చేయాలి : వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి

క్లోరినేషన్ ​ప్రాసెస్​ను ఆటోమేషన్​ చేయాలి : వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి
  • అందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి
  • వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి ఆదేశం

హైదరాబాద్ సిటీ, వెలుగు : భారీ వర్షాల నేపథ్యంలో తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నారాయణగూడలోని వాటర్​బోర్డు డివిజన్ ఆఫీసును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సమీక్షించారు. అజామాబాద్, ముషీరాబాద్ ప్రాంతాల్లో కలుషిత నీటి సమస్యకు చెక్​పెట్టాలన్నారు. రిజర్వాయర్ ఆవరణలో చెత్త, చెదారం నిల్వకుండా క్లీన్​చేయాలని, రోడ్డుకు రెండు వైపులా పూల మొక్కలు నాటాలని సూచించారు. 

క్లోరినేషన్ ప్రక్రియను ఆటోమేషన్ చేయడానికి సాధ్యాసాధ్యాల్ని పరిశీలించాలని సూచించారు. అనంతరం హిమాయత్ నగర్ కు వెళ్లారు. కాలనీల్లో పర్యటించి, స్థానికులతో మాట్లాడారు. ఓ ఇంటికి వెళ్లి నీటి క్వాలిటీ పరిశీంచారు. అంతకు ముందు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సీవరేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీజీఎం ప్రభు, జీఎం రామకృష్ణ, డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు. అలాగే వాటర్​బోర్డు ఈడీ మయాంక్ మిట్టల్ పలు ప్రాంతాల్లో పర్యటించారు. 

నాన్ డొమెస్టిక్ రెవెన్యూపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. నవ్య విహార్, ప్రశాసన్ నగర్ లో దెబ్బతిన్న సీవరేజీ పైపు లైన్ ను పరిశీలించారు. వినియోగదారుల ఇండ్లల్లో క్లోరిన్ పరీక్షలు నిర్వహించారు. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10 లో రోడ్ కటింగ్ వల్ల జరిగిన నీటి లీకేజీని పరిశీలించారు. ఆనంద్ నగర్, వెంకట రమణ కాలనీలో నీటి క్వాలిటీని చెక్​చేశారు.