హైదరాబాద్సిటీ, వెలుగు : ‘బస్తీబాట’ కార్యక్రమంలో భాగంగా బాగ్ లింగంపల్లి, పద్మ కాలనీ ప్రాంతాల్లో శుక్రవారం వాటర్బోర్డు ఎండీ అశోక్ రెడ్డి పర్యటించారు. ఉదయం నీటి సరఫరా టైంలో పలు ఇండ్లలో సరఫరా గురించి వాకబు చేశారు. పలు ఇండ్లల్లో నీటి వృథాను గుర్తించిన ఆయన ఫైన్లు వేయడంతో పాటు కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరించారు. బాగ్‌లింగంపల్లి పరిధిలోని ఆదిత్య అపార్ట్‌మెంట్‌లో ఇంకుడు గుంతలను పునరుద్ధరించే పనుల్లో పాల్గొన్నారు.
