ఫిబ్రవరి 29న ఈ ఏరియాల్లో వాటర్​ సప్లయ్​ బంద్

ఫిబ్రవరి 29న ఈ ఏరియాల్లో వాటర్​ సప్లయ్​ బంద్

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​సిటీలోని పలు ప్రాంతాల్లో గురువారం వాటర్​సప్లయ్​ఉండదని వాటర్​అధికారులు తెలిపారు. మంజీరా పంప్ హౌజుల్లో, క‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌బ్ గూర్, రాజంపేట, ప‌‌‌‌‌‌‌‌టాన్​చెరు స‌‌‌‌‌‌‌‌బ్ స్టేష‌‌‌‌‌‌‌‌న్లలో రిపేర్ల కారణంగా వాటర్​సప్లయ్​నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో లోప్రెజ‌‌‌‌‌‌‌‌ర్ తో నీటి స‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ఫ‌‌‌‌‌‌‌‌రా ఉంటుందని, మరికొన్ని ప్రాంతాల్లో మొత్తానికే నీళ్లు రావని గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 

ఎర్రగడ్డ, ఎస్.ఆర్.న‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌ర్, అమీర్ పేట, ఆఫ్ టేక్ పాయింట్స్, బ‌‌‌‌‌‌‌‌ల్క్ క‌‌‌‌‌‌‌‌నెక్షన్స్, హైద‌‌‌‌‌‌‌‌ర్ న‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌ర్ రిజ‌‌‌‌‌‌‌‌ర్వాయ‌‌‌‌‌‌‌‌ర్ ప‌‌‌‌‌‌‌‌రిధిలోని కేపీహెచ్​బీ కాల‌‌‌‌‌‌‌‌నీ, కూక‌‌‌‌‌‌‌‌ట్​పల్లి, భాగ్యన‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌ర్ కాల‌‌‌‌‌‌‌‌నీ, వ‌‌‌‌‌‌‌‌సంత న‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌ర్, ఆర్.సి.పురం. అశోక్ న‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌ర్, జ్యోతిన‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌ర్, లింగంప‌‌‌‌‌‌‌‌ల్లి, చందాన‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌ర్, గంగారం, దీప్తిశ్రీన‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌ర్, మ‌‌‌‌‌‌‌‌దీనాగూడ‌‌‌‌‌‌‌‌, మియాపూర్,  మంజీరా ఫేజ్–1లోని ఆన్ లైన్ సప్లయ్, బీరంగూడ‌‌‌‌‌‌‌‌, అమీన్ పూర్, బొల్లారం తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదన్నారు.