వయనాడ్: స్కూల్కు సెలవుంటే బాగుండు అని ప్రతీ స్టూడెంట్ కోరుకుంటాడు. కానీ కేరళలోని వయనాడ్కు చెందిన విద్యార్థి ఆలోచన దీనికి భిన్నంగా ఉంది. వరుస సెలవులు ఇవ్వొద్దంటూ కలెక్టర్కు ఒక మెయిల్ పంపింది. కలెక్టర్ దానిని స్క్రీన్ షాట్ తీసి ఎఫ్బీలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. ‘‘నా పేరు సఫూరా నౌషద్. నేను ఆరో తరగతి చదువుతున్నా. వరుసగా స్కూల్కు హాలిడేస్ ఇవ్వొద్దు. ప్లీజ్ బుధవారం స్కూల్ తెరవండి” అని పేర్కొంది. శని, ఆదివారాలు వీకెండ్, వర్షంతో సోమవారం సెలవు, మంగళవారం మొహర్రం. ఇలా వరుస సెలవులు రావడంతో కలెక్టర్ గీతకు నౌషద్ మెయిల్ పెట్టింది.

