ప్రాణాలు కాపాడే మమ్మల్ని సర్కారు పట్టించుకోవట్లే

ప్రాణాలు కాపాడే మమ్మల్ని సర్కారు పట్టించుకోవట్లే
  • కరోనాతో చనిపోయిన హెల్త్ స్టాఫ్ ఫ్యామిలీలను ఆదుకోవాలి
  •  ఒక్కో ఫ్యామిలీకి రూ. కోటి పరిహారం ప్రకటించాలి
  • 48 గంటల్లో ఎక్స్‌‌గ్రేషియా ఇవ్వాలి.. సర్కారుకు డాక్టర్ల డెడ్ లైన్
  •  తమకు వైరస్ వస్తే ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని ఆవేదన

 

కరోనాపై పోరాటంలో ఫ్రంట్‌‌‌‌లైన్‌‌‌‌లో ఉన్న డాక్టర్లు, హెల్త్ సిబ్బందే ప్రాణాలు కోల్పోతు న్నారని, తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా పేషెంట్లకు సేవలందిస్తూ వైరస్ బారిన పడి ఓ డాక్టర్  సహా 9 మంది చనిపోయారని, వాళ్ల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని అన్నారు. చనిపోయిన ఒక్కొక్కరి కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌‌‌‌గ్రేషియా ప్రకటించాలని, ఇందుకు ప్రభుత్వానికి 48 గంటల డెడ్‌‌‌‌లైన్‌‌‌ ‌విధించారు. అప్పటికీ ప్రకటించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇన్నాళ్లు ప్రభుత్వంపై ఈగ వాలకుండా చూసుకున్నామని, ఇకపై ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. గవర్న మెంట్ డాక్టర్స్  అసోసియేషన్‌‌‌‌, జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్, నిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్  ‌‌‌అసోసియేషన్, హెల్త్ రిఫార్మ్స్‌ డాక్టర్ అసోసియేషన్‌‌‌‌, ఇతర హెల్త్ అసోసియేషన్ల ప్రతినిధులంతా కలిసి హైదరాబాద్లోని కోఠి హెల్త్ ఆఫీస్ వద్ద సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.

కరోనా వచ్చిన డాక్టర్లను , స్టాఫ్‌ను సర్కార్ నిరక్ష్ల్యం చేస్తోందని డాక్టర్లు ఆరోపించారు. కరోనా ట్రీట్‌మెంట్‌ను డీసెంట్రలైజ్ చేయాలని అడిగితే, ప్రభుత్వం ప్రైవేటైజ్ చేసిందని విమర్శించారు. ప్రాణాలకు తెగించి ట్రీట్మెంట్ అందిస్తున్న తమకు వైరస్ సోకితే ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఈటల రాజేందర్ అన్నింటికీ సానుకూలంగానే స్పందిస్తారని, కానీ ఒక్క పని కూడా జరగదని చెప్పారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని వందలసార్లు విజ్ఞప్తి చేసినా సరైన స్పందన లేదన్నారు. క్వారంటైన్ లీవుల విషయంలో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్  సహకరించడం లేదని డాక్టర్లు ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌‌ తమకు అపాయింట్‌మెంట్ ఇచ్చి, సమస్యలను చెప్పుకునే సమయం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో డాక్టర్లు నరహరి, పల్లం ప్రవీణ్, లాలూ ప్రసాద్‌, మహేశ్‌, పుట్ల శ్రీనివాస్‌, బొంగు రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ కు కొత్త చీఫ్ దొరకలే