భారత్, అమెరికా మధ్య ప్రవాసులే వారధి

భారత్, అమెరికా మధ్య ప్రవాసులే వారధి

అమెరికా, భారత్ ప్రయోజనాల కోసమే కాకుండా ఇండో- పసిఫిక్ రీజియన్ కోసం కలిసి పనిచేస్తున్నామంది అమెరికా. యూఎస్ లోని స్టూడెంట్లు, రీసెర్చర్లతో సమావేశమయ్యారు భారత్, అమెరికా మంత్రులు. వాషింగ్టన్ లో జరుగుతున్న 2 ప్లస్ 2 చర్చల కోసం అమెరికా వెళ్లారు కేంద్రమంత్రులు జైశంకర్, రాజ్ నాథ్ సింగ్. 4.4 మిలియన్ల ప్రవాసులు భారత్ , అమెరికా మధ్య వారధిగా ఉన్నారన్నారు జైశంకర్. 
మహాత్మా గాందీ, డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మధ్య ఉన్న స్ఫూర్తిదాయకమమైన బంధమే.. సత్సంబంధాలకు అత్యంత శక్తివంతమైన చిహ్నమన్నారు జైశంకర్. ఈ ఏడాది టోక్యోలో జరిగే క్వాడ్ లీడర్స్ సమ్మిట్ కోసం ఎదురు చూస్తున్నామని ఇరు దేశాలు తెలిపాయి. క్వాడ్ భాగస్వామ్యంతో 500 మిలియన్ వ్యాక్సిన్లు విరాళమిచ్చామన్నారు అమెరికా విదేశంగా శాఖ కార్యదర్శి బ్లింకెన్. ఇతర దేశాలతో కలిసి పనిచేయకపోతే.. మ్యుటేషన్లు ఏర్పడి వైరస్ మరింత్ వ్యాప్తి చెందే అవకాశముందన్నారు.

 

ఇవి కూడా చదవండి

మహిళల భద్రత కోసం కర్ణాటకలో నెలంతా సేఫ్టీ రైడ్

జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కొలరెక్టల్‌‌ క్యాన్సర్‌‌‌‌!

ఎక్కువ కాల్షియాన్ని అందించే ఫుడ్స్​ ఇవే..

నీళ్లు ఇవ్వకుంటే మూత్రం తాగేసే వాళ్లం

ఏపీలో రేషన్ కార్డు దారులకు శుభవార్త