భారత రక్షణకు మా మద్దతు: దోవల్ కు అమెరికా ఎన్ఎస్ఏ ఫోన్

భారత రక్షణకు మా మద్దతు: దోవల్ కు అమెరికా ఎన్ఎస్ఏ ఫోన్

వాషింగ్టన్: భారత్ రక్షణకు తమ పూర్తి మద్దతు ఉంటుందని అమెరికా తెలిపింది. ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) జాన్ బోల్టన్ ఈ విషయాన్ని చెప్పారు. శుక్రవారం ఆయన భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కు ఫోన్ చేశారు. ఉగ్రవాదం నుంచి భారత్ తనను రక్షించుకోవడంలో పూర్తి మద్దతు అందిస్తామని తెలిపారు. దోవల్ తో రెండు సార్లు మాట్లాడానని, పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు సంతాపాన్ని తెలిపామని జాన్ మీడియాకు చెప్పారు. ఉగ్రవాదులకు సాయం చేయడం మానుకోవాలని పాకిస్థాన్ ను హెచ్చరించామని అన్నారు. ముష్కరులపై పోరులో ఇండియాకు తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు.