మరో 2 ఏళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ చేస్తం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మరో 2 ఏళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ చేస్తం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నాగర్ కర్నూల్: మరో రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం (మే 1) ఉత్తమ్ కుమార్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ టన్నెల్ సంఘటన దురదృష్టకరమని.. మృతుల కుటుంబ సభ్యులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. టన్నెల్‎లో ఇంకా దొరకని ఆరు మృతదేహాల బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నామన్నారు.

ALSO READ | తెలంగాణ రైజింగ్ ను ఎవరూ ఆపలేరు.. దేశానికే రోల్ మోడల్ : సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వ పరంగా ఒక్కో కుటుంబానికి  రూ.25 లక్షల పరిహారం చెల్లించామని తెలిపారు. జియో లాజికల్ సర్వే సూచన మేరకే  రెస్క్యూ ఆపరేషన్  నిలిపివేశామని క్లారిటీ ఇచ్చారు. ఆరు మృతదేహాల ఉన్న ఘటన స్థలంలో క్రిటికల్ కండిషన్ ఉందని.. రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటంతో సహయక చర్యలు ఆపేశామని తెలిపారు. ఎస్ఎల్బీ టన్నెల్ పనుల పూర్తి కోసం హై లెవెల్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశామని చెప్పారు. 

2026 మార్చి 31 వరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వేగంగా కంప్లీట్ చేసి.. 2027 మార్చి నాటికి ఉదండాపూర్ వరకు  నీరు అందిస్తామన్నారు. వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం భూ సేకరణకు సత్వర చర్యలకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపారు. పాలమూరు జిల్లా గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. 

బీఆర్ఎస్ హయాంలో కృష్ణా నది జలాల కేటాయింపులో పాలమూరు, నల్లగొండకు తీరని అన్యాయం జరిగిందన్నారు. 819 టీఎంసీల కృష్ణ జలాలను ఆంధ్రకు కేటాయిస్తుంటే బీఆర్ఎస్ పాలకులు చోద్యం చూశారని ధ్వజమెత్తారు. కేవలం 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు వాటా దక్కిందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్ష కోట్ల ప్రజాధనం గోదావరి పాలు చేశారని మండిపడ్డారు.