
తెలంగాణ రైజింగ్ ను ఎవరూ ఆపలేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని అన్నారు. ఖజానా ఖాళీ చేసినా రాష్ట్రాన్ని లూటీ చేసినా పథకాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. రవీంద్ర భారతిలో మేడే వేడుకల్లో పాల్గొన్న రేవంత్.. ఒక్క ఫ్యామిలీనే రాష్ట్రాన్ని రూ. 8లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. కేసీఆర్ చేసిన రూ. 8 లక్షల కోట్ల అప్పు ఎటు వెళ్లిందో అర్థం కావట్లేదున్నారు. అప్పులకే ప్రతి నెల 10 వేల కోట్ల మిత్తీలు కడుతున్నామని ధ్వజమెత్తారు రేవంత్. కేసీఆర్ పదేళ్ల విధ్వంసాన్ని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు రేవంత్. కేసీఆర్ విషం చిమ్ముకుని మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కపటనాట సూత్రధారి కేసీఆర్ అని ధ్వజమెత్తారు రేవంత్.
తాను ఒక్క పైసా అవినీతి చేయబోనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సర్పంచులకు ఇంకా పెండింగ్ బిల్లులు ఉన్నాయంటే కేసీఆరే కారణమన్నారు రేవంత్. బీఆర్ఎస్ వల్ల విద్యుత్ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఫైర్ అయ్యారు. రాష్ట్రం చేపట్టిన కులగణనే దేశానికి రోల్ మోడల్ అని అన్నారు. ప్రాజెక్టులు కుప్పకూలడం ఎక్కడైనా చూశారా? అని ప్రశ్నించారు రేవంత్. కట్టిన మూడేళ్లకే కాళేశ్వరం కుప్పకూలిందన్నారు. కేసీఆర్ కనీసం దళితుడిని ప్రతిపక్ష నాయకుడిగా చేయాలన్నారు.
Also Read : పంతాలకు పోయి సమ్మె చేయొద్దు
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లవద్దు..సంస్థ నష్టాల్లోకి వెళ్తుందన్నారు. కార్మికులు పంథాలకు పోవద్దు...ఆర్టీసీ ఇపుడే కుదుటపడుతోందన్నారు. తాము ఆర్టీసీని గాడిలో పెట్టి అప్పులు తీరుస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో కార్మికులు భాగస్వామ్యం కావాలన్నారు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీని జీతాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ దేశంలోనే ఫస్ట్ అని అన్నారు. సింగరేణి,ఆర్టీసీలో కారుణ్య నియమకాలు చేపడుతున్నామన్నారు. అసంఘటిత కార్మికుల సమస్యలను తీరుస్తున్నామన్నారు