పంతాలకు పోయి సమ్మె చేయొద్దు.. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది: సీఎం రేవంత్

పంతాలకు పోయి సమ్మె చేయొద్దు.. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది: సీఎం రేవంత్

ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచనను విరమించుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.  కార్మికులు పంతాలు పట్టింపులకు  పోయి  సమ్మె చేయొద్దన్నారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే  కుదుటపడుతోందన్నారు. పదేళ్లు ఏమీ చేయని వారు  చెబితే ఉచ్చులో పడొద్దన్నారు. తాము ఆర్టీసీని గాడిలో పెట్టి అప్పులు తీరుస్తున్నామని చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే రవాణాశాఖ మంత్రితో మాట్లాడుకోవాలని సూచించారు. సమ్మెపోటు రాష్ట్రానికి నష్టం చేస్తుందన్నారు రేవంత్.సంస్థ లాభాలను మీ చేతిలో పెడతా..ఎలా ఖర్చు పెట్టాలో ఏం చేద్దామో చెప్పండి..మీ సంస్థను మీరే కాపాడుకోవాలని సూచించారు రేవంత్. 

Also Read : తెలంగాణ రైజింగ్ ను ఎవరూ ఆపలేరు

తమ డిమాండ్లను పరిష్కరించకపోతే  మే 7 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ సంఘాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని..ఏదైనా సమస్య ఉంటే  కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు రేవంత్. 

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు

 సీఎం త్వరగా ఆర్టీసీ విలీనాన్ని చేపట్టాలి.   ఆర్టీసీలో ప్రజాపాలన చేయాలి.  ప్రైవేటీకరణకు మూలమైన ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం కొని నడపాలి.  2021 వేతన సవరణ చేయాలి, పెండింగ్ బకాయిలు చెల్లించాలి.  ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఆర్టీసి కార్మికులను ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వంలో ఆర్టిసి విలీన ప్రక్రియ చేపట్టాలి.  16 వేల మంది రిటైర్ అయిన ఖాళీలను భర్తీ చేయాలి.  సీఎం వెంటనే ఆర్టీసీలో నెలకొన్న  సమస్యల పై తమ వైఖరి తెలపాలి అని ఆర్టీసీ సంఘాలు  డిమాండ్ చేస్తున్నాయి.