హైదరాబాద్ :  వీకెండ్ డ్రంకెన్ డ్రైవ్.. 214 మందిపై కేసులు

హైదరాబాద్ :  వీకెండ్ డ్రంకెన్ డ్రైవ్.. 214 మందిపై కేసులు

మల్కాజిగిరి, వెలుగు: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో వీకెండ్ సందర్భంగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 214 మంది పట్టుబడ్డారు. వీరిలో అత్యధికంగా187 మంది ద్విచక్ర వాహనదారులు, 21 మంది కారు యజమానులు, ఐదుగురు ఆటో డ్రైవర్లు, ఒక భారీ వాహనదారుడు ఉన్నారు. గత వారంలో నమోదైన 128 కేసుల్లో 8 మందికి జరిమానాతో పాటు సామాజిక సేవ చేయాలని కోర్టు ఆదేశించిందని పోలీసులు తెలిపారు.