హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన వీకెండ్ స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 281 మందిపై కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ తెలిపారు. ఈ తనిఖీల్లో 224 బైక్‌లు, 8 ఆటోలు, 7 భారీ వాహనాలతో పాటు ఇతర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, పట్టుబడిన వారందరినీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మద్యం సేవించి బండ్లు నడిపితే గరిష్టంగా 10 ఏండ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. గత వారం కోర్టులో పరిష్కారమైన 218 కేసుల్లో 13 మందికి జైలు శిక్ష, ఐదుగురికి జరిమానా, మరో 200 మందికి సామాజిక సేవతో పాటు జరిమానా విధించినట్లు తెలిపారు.
