వార ఫలాలు (సౌరమానం)

వార ఫలాలు (సౌరమానం)
  • 13–11–2022 నుంచి 19–11–2022 వరకు

మేషం (మార్చి21 – ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌20)
మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చీటికీ మాటికీ వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరతాయి. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. నిరుద్యోగుల శ్రమ వృథా కాదు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. 

వృషభం (ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌21 – మే21)
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆదాయానికి ఇబ్బందులు తొలగుతాయి. సన్నిహితులతో సఖ్యత. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతం. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. 
జీవితాశయం నెరవేరుతుంది. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. రియల్టర్లకు మరింత సానుకూలమైన కాలం. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. 

మిథునం (మే22 – జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)
చేపట్టిన  కార్యాలలో కొద్దిపాటి అవాంతరాలు. తరచూ ప్రయాణాలు. నిర్ణయాలు వాయిదా. ఆత్మీయులతో వివాదాలు నెలకొన్నా పరిష్కారమవుతాయి. విద్యార్థుల శ్రమ కొంత ఫలిస్తుంది. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులు ఒత్తిడులు పెంచుతారు. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారులకు లాభాలు స్వల్పమే. ఉద్యోగులకు
బాధ్యతలు పెరుగుతాయి. 

కర్కాటకం (జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – జూలై23)
చేపట్టిన కార్యాలు కొన్ని మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు కలసిరాకున్నా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. కొన్ని సమస్యలను అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.  ఆస్తుల వ్యవహారాల్లో ప్రతిష్ఠంభన. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. వారారంభంలో శుభవార్తలు. వాహనయోగం. ఆహ్వానాలు.

సింహం (జూలై24 – ఆగస్టు22)
కొత్త కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రాబడి ఆశాజనకం. వాహనాలు, స్థలాలు కొంటారు. శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారులు మరింత ఉత్సాహవంతంగా ముందుకు సాగుతారు. ఉద్యోగులకు హోదాలు దక్కే అవకాశం.

కన్య (ఆగస్టు23 – సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)
ముఖ్య కార్యాలు ఎట్టకేలకు పూర్తి. ఆదాయం పెరిగే అవకాశం. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. శత్రువులు స్నేహితులుగా మారతారు. సమాజంలో గౌరవ, మర్యాదలు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి తెచ్చుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారులకు భాగస్వాములతో సఖ్యత. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు.

తుల (సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)
ప్రముఖ వ్యక్తులు పరిచయమై సాయం అందిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వాహనాలు కొంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. ఆస్తుల వ్యవహారాల్లో చిక్కులు తొలగుతాయి. విద్యార్థులకు శుభవర్తమానాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గుతుంది.

వృశ్చికం (అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23– నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)
చేపట్టిన కార్యక్రమాలు కొంత నెమ్మదించినా చివరికి పూర్తి. బంధువులతో సత్సంబంధాలు. మీ కష్టం ఫలించే సమయం. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు. అందరిలో గౌరవమర్యాదలు. వాహనాలు, భూములు కొంటారు. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు అనుకున్న హోదాలు.

ధనుస్సు (నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)
ప్రయాణాల్లో కొత్త పరిచయాలు. గతంతో పోలిస్తే రాబడి మెరుగ్గా ఉంటుంది. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు. అందరూ మెచ్చే నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. విధుల్లో చికాకులు తొలగి ఉద్యోగులు ఊరట చెందుతారు.

మకరం (డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – జనవరి22)
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సమాజంలో ప్రత్యేకత చాటుకుంటారు. మీ అంచనాలు, ఊహలు నిజం చేసుకుంటారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుని ముందడుగు వేస్తారు. మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు హోదాలు దక్కే ఛాన్స్‌‌.

కుంభం (జనవరి23 – ఫిబ్రవరి22)
ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆaత్మీయులు, బంధువుల నుంచి సహాయ, సహకారాలు అందుతాయి. కుటుంబసమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. కుటుంబసభ్యులు మీ నిర్ణయాలను స్వాగతిస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి.

మీనం (ఫిబ్రవరి23 – మార్చి20)
ఆశించిన ఆదాయం సమకూరుతుంది. అందరిలో గౌరవం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు, ఆస్తుల సమస్యల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణయత్నాల్లో ముందడుగు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యాపారులకు పెట్టుబడులు మరింత అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు.

వక్కంతం చంద్రమౌళి, జ్యోతిష్య పండితులు
ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 98852 99400