వార ఫలాలు (సౌరమానం)

వార ఫలాలు (సౌరమానం)

మేషం (మార్చి21 – ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌20)

ఇష్టపడే వ్యక్తులు మరింత పెరుగుతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలను పాటిస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు. వాక్చాతుర్యం మంచి గుర్తింపు తెస్తుంది. రావలసిన సొమ్ము కోసం నిరీక్షణ తప్పుతుంది. ఆకస్మిక ధన లాభం. శుభకార్యాలపై  ప్రణాళికలు రూపొందిస్తారు. వ్యాపారులకు లాభనష్టాలు సమానం. ఉద్యోగులకు చేజారిన అవకాశాలు దక్కుతాయి.

వృషభం (ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌21 – మే21)

కార్యజయంతో ఉత్సాహంగా సాగుతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు దక్కే ఛాన్స్.  ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. ఎంతోకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారులకు పెట్టుబడులు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఎదురుండదు.

మిథునం (మే22 – జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)

కొంతవరకూ మౌనం మంచిది. స్నేహితులతో వ్యక్తిగత విషయాలను చర్చిస్తారు. నిరుద్యోగులకు కొంత ఫలితం కనిపిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. కుటుంబసభ్యులు, బంధువులతో తగాదాలు కొంత వరకూ సర్దుబాటు కాగలవు. వ్యాపారులకు ఆటుపోట్లు ఎదురైనా అధిగమిస్తారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

కర్కాటకం (జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – జూలై23)

ఎంతటి కార్యమైనా అవలీలగా పూర్తి. పేరుప్రతిష్ఠలు దక్కుతాయి. ఆత్మవిశ్వాసంతో కొన్ని సమస్యల పరిష్కారం. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. ఉద్యోగావకాశాలు దగ్గరకు వస్తాయి. రెండు,మూడు విధాలుగా ధనలాభాలు. శుభకార్యాలు నిర్వహిస్తారు. భూ, వాహనయోగాలు కలిగే అవకాశాలు. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది.

సింహం (జూలై24 – ఆగస్టు22)

అనుకున్న కార్యాలు పూర్తి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. ప్రముఖ వ్యక్తులు మీ పరిచయానికి ఆసక్తి చూపుతారు. భూములు, వాహనాలు,ఆభరణాలు కొంటారు. శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపారులకు కోరుకున్న లాభాలు. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉండి, విధుల్లో చిక్కులు తొలగుతాయి.

కన్య (ఆగస్టు23 – సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)

ప్రారంభంలో కొన్ని చికాకులు ఎదురైనా లక్ష్యాలు సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యక్రమాలు అనుకున్న మేరకు పూర్తి. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. రాబడి పెరుగుతుంది. రావలసిన సొమ్ము సైతం అందుతుంది. కుటుంబసభ్యుల ప్రేమానురాగాలు పొందుతారు. వ్యాపారులకు కోరుకున్న లాభాలు అందే అవకాశం. ఉద్యోగులకు హోదాలు అప్రయత్నంగా దక్కుతాయి.

తుల (సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)

కొత్త విషయాలు తెలుస్తాయి. అందరిలో సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. వస్త్రాలు, ఆభరణాలు కొంటారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది.  కుటుంబసభ్యులు మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. సోదరులతో వివాదాలు తీరతాయి. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు ఊహించని హోదాలు.

వృశ్చికం (అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23– నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)

కొన్ని కార్యక్రమాలు సమయానికి పూర్తి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. రాబడి పెరుగుతుంది. కొన్ని నిర్ణయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వాహనాలు, స్థలాలు కొనుగోలులో అవరోధాలు తొలగుతాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు ఆశలు ఫలిస్తాయి. ఉన్నతాధికారులను మెప్పించి పనిసామర్థాన్ని నిరూపించుకుంటారు.

ధనుస్సు (నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)

పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి విజయాల బాటలో పయనిస్తారు. రాబడి సంతృప్తికరం. దీర్ఘకాలిక రుణబాధల నుంచి విముక్తి. బంధువులు తాకిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వ్యాపారులు కొత్త పెట్టుబడులతో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు సానుకూలమైన సమయం.

మకరం (డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – జనవరి22)

అనుకున్న కార్యక్రమాలలో కొంతమేర విజయం. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. అపవాదుల నుంచి బయటపడతారు. కొన్ని వివాదాలు సైతం పరిష్కారం. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. రాబడి సంతృప్తికరం. ఆప్తుల నుంచి ధనలాభం. బంధువులతో సత్సంబంధాలు. వ్యాపారులకు తగిన పెట్టుబడులు. లాభాల్లో లక్ష్యాల సాధనకు చేరుకుంటారు. ఉద్యోగులకు అనూహ్యమైన మార్పులు.

కుంభం (జనవరి23 – ఫిబ్రవరి22)

ఈవారం అనుకున్న కార్యక్రమాలలో ముందడుగు. ప్రముఖుల సహకారం. ప్రయాణాల్లో నూతన వ్యక్తుల పరిచయం. మీ అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. చిరకాల ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. ఆస్తి వ్యవహారాలను కొలిక్కి తెస్తారు. వాహనయోగం. విద్యార్థులకు అనుకూల  ఫలితాలు. రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారులకు ఊరట లభిస్తుంది. ఉద్యోగులకు అనుకూల  పరిస్థితులు.

మీనం (ఫిబ్రవరి23 – మార్చి20)

పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. విద్యార్థులకు ఊహించని ఫలితాలు రావచ్చు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు కొంటారు. రావలసిన బాకీలు అంది అవసరాలు తీరతాయి. అందరిలోనూ సత్తా చాటుకుని ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు  బాధ్యతలతో పాటు, ప్రశంసలు అందుతాయి. కొన్ని మార్పులు కూడా జరిగే సూచనలు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 98852 99400