వైరల్ వీడియో: నౌకర్లతో కలిసి ఓనర్ స్టెప్పులు

వైరల్ వీడియో: నౌకర్లతో కలిసి ఓనర్ స్టెప్పులు

వెల్‌స్పన్ సీఈవో దీపాలీ గోయెంకా ‘హ్యాపీ ఆఫీస్ ’

ఆమె కంపెనీకి సీఈవో, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్. ఓనర్ భార్య. కానీ, ఆఫీసులో ఎంప్లాయీస్‌తో కలిసి స్టెప్పులేశారు. ఉద్యోగులను ఆనందంలో ముంచెత్తారు. వెల్‌స్పన్ ఇండియా సీఈవో దీపాలీ గోయెంకా, ఆఫీసులో ఉద్యోగులతో కలిసి డ్యాన్సు చేసిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. హ్యాపీ వర్క్ ప్లేస్‌కు ఇది చిరునామా అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. స్ట్రీట్ డ్యాన్సర్ త్రీడీ సినిమాలోని ముఖాబులా పాటకు స్టెప్పులేశారు ఆమె. అంతేకాదు, ఎంప్లాయీస్‌ను తనతో కలుపుకుని డ్యాన్స్​ చేశారు. ఉద్యోగులూ ఆమె స్టెప్పులను ఫాలో చేస్తూ ఎంజాయ్ చేశారు. 45 సెకన్లున్న ఆ వీడియోను ఆర్పీజీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఓ సీఈవో ఇలా ఎంప్లాయీస్‌తో కలిసి డ్యాన్స్​ చేయడం అరుదన్నారు. ఓ సంతోషకరమైన కల్చర్‌ను క్రియేట్ చేసే పద్ధతి ఇదంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన దీపాలీ.. ఆనంద్ మహీంద్ర, గౌతమ్ అదానీ, కిరణ్ మజుందార్ షాలను ట్యాగ్ చేసి, ‘ఇది నా వర్క్ ప్లేస్ హ్యాపీనెస్. మరి, మీది?’ అంటూ సవాల్ విసిరారు. ఆ వీడియోను
ఇప్పటిదాకా 1.6 లక్షల మందికి పైగా చూశారు. ఇలాంటి మంచి ఆఫీసు వాతావరణాన్ని కల్పించే లీడర్లే తమకు స్ఫూర్తి అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. హ్యాపీ, ఫిట్ సీఈవోలు, సేమ్ అదే వాతావరణాన్ని కంపెనీలోనూ కల్పిస్తారని కొనియాడుతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో సైకాలజీలో డిగ్రీ చేసిన ఆమె, 2002లో వెల్‌స్పన్ ఇండియా సీఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. 2016లో ఆసియాలో అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో 16వ ర్యాంకు సాధించారు. ఫోర్బ్స్ మేగజీన్ శక్తిమంతమైన ఇండియన్ మహిళల జాబితాలో నాలుగో ర్యాంకు సాధించారు దీపాలీ గోయెంకా.

For More News..

మాఫియా డాన్ శివశక్తి నాయుడు ఎన్‌కౌంటర్

మహిళల హాకీ మాజీ కెప్టెన్‌‌కు వరకట్న వేధింపులు