వెస్ట్ బెంగాల్ రెండో దశలో 142 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. మొదటి దశలో రికార్డు స్థాయిలో నమోదైన పోలింగ్.. సెకండ్ ఫేజ్ లో కూడా అదే ట్రెండ్ కనిపిస్తోంది. 2026 ఏప్రిల్ 29వ తేదీ 7 గంటలకు మొదలైన పోలింగ్ లో.. మధ్యాహ్నం 3 గంటల వరకు రికార్డు స్థాయిలో దాదాపు 78.68 శాతం నమోదయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
మధ్యాహ్నం 3 గంటల వరకు తూర్పు బుర్ద్వాన్ జిల్లాలో 83.11శాతంతో అత్యధిక పోలింగ్ నమోదైంది. మరోవైపు కోల్‌కతా సౌత్‌లో 75.38శాతంతో అత్యల్ప పోలింగ్ నమోదైంది. కొన్ని చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భవానిపూర్‌లో కూడా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అక్కడ మమతా బెనర్జీ .సువేందు అధికారి ఒకే బూత్ లో తీవ్ర వాగ్వాదానికి దిగారు.
ఏ జిల్లాలో ఎంత శాతం అంటే.?
- హుగ్లీ జిల్లాలో 80.77 శాతం
- హౌరా: 77.73 శాతం
- కోల్ కతా నార్త్ : 78శాతం
- కోల్కతా సౌత్ : 75.38
- నాడియా : 79.79 శాతం
- నార్త్ 24 పరగణాలు : 77.39 శాతం
- బర్ద్ మాన్ జిల్లా :83.11 శాతం
- సౌత్ 24 పరగణాలు : 76.75 శాతం

