బెంగాల్ లో పలుచోట్ల ఘర్షణలు.. కొన్ని చోట్ల మరోసారి రీపోలింగ్!

బెంగాల్ లో పలుచోట్ల ఘర్షణలు.. కొన్ని చోట్ల మరోసారి రీపోలింగ్!

పశ్చిమ బెంగాల్  అసెంబ్లీ  ఎన్నికల్లో మరో ట్విస్ట్..రెండో విడత పోలింగ్ లో ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలతో ఇవాళ (మే 2) దక్షిణ 24 పరగణాల జిల్లాలో రీపోలింగ్ జరుగుతున్న విషయంతెలిసిందే.. అయితే రీపోలింగ్ లో కూడా కొన్ని చోట్ల ఘర్షణలు, అవకతవకలు జరిగాయంటూ ఈ సీకి అందిన ఫిర్యాదులతో మరోసారి  ఆ ప్రాంతాల్లో ఎన్నికల ఫిలితాలకు ముందు రోజు అనగా రేపు (ఆదివారం)  రీపోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 

ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ సమయంలో పలు సమస్యలు తలెత్తినట్లు పరిశీలకుల నుంచి ఎన్నికల సంఘానికి నివేదికలు అందాయి. ఓట్ల లెక్కింపునకు ఒక రోజు ముందు అంటే రేపు ఆ ప్రాంతంలోని పలు బూత్‌లలో తిరిగి పోలింగ్ నిర్వహించడంపై వారు ఈ శనివారం రాత్రికి నిర్ణయం తీసుకోనున్నారు.

మరోవైపు పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో  రీపోలింగ్ లో మగ్రాహత్ పశ్చిమ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 పోలింగ్ బూత్ లతో మధ్యాహ్నం 3 గంటల వరకు 72.50శాతం పోలింగ్ నమోదు కాగా,  డైమండ్ హార్బర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 4 బూత్ లలో 72.36శాతం ఓటింగ్ నమోదు అయింది. 72.43 శాతం మొత్తం ఓటింగ్ శాతం నమోదు అయింది. రెండు నియోజకవర్గాల్లో రీపోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు తలెత్తాయి.  టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు బెదిరింపులు, దాడులు చేసుకున్నారు. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఈ ఘర్షణల్లో పలువురిని అరెస్టు చేశారు. 

►ALSO READ | 200కు పైగా సీట్లు గెలుస్తం.. స్టాక్ మార్కెట్‎ను తారుమారు చేసేందుకే ఎగ్జిట్ పోల్స్: దీదీ సంచలన వ్యాఖ్యలు

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లను (EVMలను) నిల్వ చేసే స్ట్రాంగ్ రూమ్‌లలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై కొత్త వివాదం చెలరేగింది. తృణమూల్ కాంగ్రెస్ ఒక రిటర్నింగ్ అధికారిపై పోస్టల్ బ్యాలెట్‌లను అనధికారికంగా నిర్వహించారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా ఓ స్ట్రాంగ్ రూమ్‌ను తెరిచారని ఆరోపించడంతో విచారణ చేపట్టారు. 


ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు, ముఖ్యంగా బటన్లను టేపుతో కప్పివేశారనే ఆరోపణలతో పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఉన్న డైమండ్ హార్బర్ ,మగ్రాహత్ పశ్చిమ్ ప్రాంతాలలోని 15 బూత్‌లలో మే 2న రీ-పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే..బూత్ జామింగ్ ,రిగ్గింగ్ ఫిర్యాదులతో ఏప్రిల్ 29న జరగాల్సిన పోలింగ్‌ను రద్దు చేసి  ఇవాళ నిర్వహిస్తోంది.