ఐపీఎల్‌‌‌‌ బరిలోకి షమార్ జోసెఫ్‌‌‌‌

ఐపీఎల్‌‌‌‌ బరిలోకి  షమార్ జోసెఫ్‌‌‌‌

న్యూఢిల్లీ: వెస్టిండీస్ పేస్ సెన్సేషన్‌‌‌‌ షమార్ జోసెఫ్‌‌‌‌కు ఐపీఎల్‌‌‌‌ చాన్స్‌‌‌‌ వచ్చింది. ఇటీవల గబ్బా టెస్టులో అద్భుత బౌలింగ్‌‌‌‌తో ఆస్ట్రేలియాపై విండీస్‌‌‌‌ను గెలిపించి వార్తల్లో  నిలిచిన షమార్‌‌‌‌‌‌‌‌ను ఇంగ్లండ్‌‌‌‌ పేసర్ మార్క్ వుడ్‌‌‌‌కు రీప్లేస్‌‌‌‌మెంట్‌‌‌‌గా  లక్నో సూపర్ జెయింట్స్‌‌‌‌ (ఎల్‌‌‌‌ఎస్‌‌‌‌జీ) తమ టీమ్‌‌‌‌లోకి తీసుకుంది. 24 ఏండ్ల జోసెఫ్‌‌‌‌ రూ. 3 కోట్ల కాంట్రాక్టుతో లక్నో టీమ్‌‌‌‌లో చేరనున్నాడు.

అతనికిదే తొలి ఐపీఎల్‌‌‌‌ కాంట్రాక్ట్ కావడం విశేషం. కాగా, మార్క్‌‌‌‌ వుడ్‌‌‌‌ ఈ సీజన్‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌ నుంచి తప్పుకోవడానికి గల కారణాలను తెలియరాలేదు. ప్రస్తుతం అతను ఇండియాతో ఐదు టెస్టుల సిరీస్‌‌‌‌ ఆడుతున్న ఇంగ్లండ్‌‌‌‌ టీమ్‌‌‌‌లో ఉన్నాడు.